Home న్యూస్ భీమా ట్రైలర్ రివ్యూ…..గోపీచంద్ ఊరమాస్ కంబ్యాక్ కన్ఫాం!

భీమా ట్రైలర్ రివ్యూ…..గోపీచంద్ ఊరమాస్ కంబ్యాక్ కన్ఫాం!

0

మాచో స్టార్ గోపీచంద్(Gopichand) బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ కొట్టి చాలా ఏళ్ళు అవుతుంది, అప్పుడెప్పుడో లౌక్యం సినిమాతో బ్లాక్ బస్టర్ కొట్టిన గోపీచంద్ తర్వాత చేసిన సినిమాలు అన్నింటిలో ఒక్క సీటిమార్ సినిమాతో పర్వాలేదు అనిపించినా కూడా హిట్ గీతని అయితే దాటలేదు… రీసెంట్ టైంలో బాక్స్ ఆఫీస్ దగ్గర….

మరీ నిరాశ పరిచే రిజల్ట్ లు సొంతం అవుతూ ఉన్న టైంలో ఇప్పుడు గోపీచంద్ మాస్ కంబ్యాక్ కి సిద్ధం అవుతున్నాడు…. తన లేటెస్ట్ మూవీ భీమా(Bhimaa Movie) మార్చ్ రెండో వారంలో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉండగా సినిమా అఫీషియల్ ట్రైలర్ ను రీసెంట్ గా రిలీజ్ చేశారు…

ట్రైలర్ చూసిన తర్వాత ఇది గోపీచంద్ కి సాలిడ్ కంబ్యాక్ మూవీ అవ్వడం ఖాయంగా కనిపిస్తూ ఉందని చెప్పాలి ఇప్పుడు. సినిమా ట్రైలర్ లో కథ ఎలా ఉండబోతుంది అన్నది చెప్పారు….శ్రీ మహా విష్ణువు 6వ అవతారం పరశురాముడు నిర్మించిన పరశురాముడి క్షేత్రం…కాల క్రమంలో చెడు శక్తుల చేతిలోకి వెళ్ళిన తర్వాత పరశురాముడు అంశతో…

వచ్చిన హీరో ఏం చేశాడు….ఆ ఊరిని ఎలా కాపాడాడు అన్న కాన్సెప్ట్ తో వస్తున్నా భీమా సినిమా కొంచం ఫాంటసీ ఎలిమెంట్స్ తో మాస్ మూమెంట్స్ తో నిండిపోయింది, రవి బసృర్ అందించిన బ్యాగ్రౌండ్ స్కోర్ కొన్ని సీన్స్ ను ఎక్స్ లెంట్ గా ఎలివేట్ అయ్యేలా చేసిందని చెప్పాలి…. గోపీచంద్ మాస్ ఎలివేశన్స్ తో….

అదరగొట్టేయగా…విజువల్స్ కానీ గ్రాండియర్ కానీ బాగానే మెప్పించాయి. గోపీచంద్ రీసెంట్ మూవీస్ తో పోల్చితే కచ్చితంగా బెటర్ కంటెంట్ తో వచ్చిన సినిమాగా భీమాగా అనిపించింది ఈ ట్రైలర్…. ఓవరాల్ గా సినిమా మీద అంచనాలను అయితే ఈ ట్రైలర్ సాలిడ్ గా పెంచేసింది అని చెప్పాలి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఏ రేంజ్ లో రచ్చ లేపుతుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here