మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి(Mammootty) నటించిన లేటెస్ట్ మూవీ…. భ్రమయుగం(Bramayugam Movie Telugu Review) ప్రయోగాత్మక సినిమాగా తెరకెక్కింది…. సినిమా రీసెంట్ గా మలయాళంలో రీసెంట్ గా రిలీజ్ అయ్యి యునానిమస్ రివ్యూలను సొంతం చేసుకుని అక్కడ కలెక్షన్స్ పరంగా దుమ్ము లేపుతూ ఉండగా…
సినిమా తెలుగు డబ్ వర్షన్ రీసెంట్ గా రిలీజ్ అవ్వగా తెలుగులో ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది అన్నది ఆసక్తిగా మారగా…. ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ డిఫెరెంట్ గా ఉంటుంది కాబట్టి ఈ స్లో పేస్ తో సాగే ఎక్స్ పెరిమెంటల్ మూవీ కి పర్వాలేదు అనిపించేలా రెస్పాన్స్ ఉందని చెప్పాలి…. కథ పాయింట్…ఒక గాయకుడు అడవిలో ప్రయాణం చేస్తూ ఒక…
పాత ఇంటికి వెళ్ళగా అక్కడ పనివాడితో ఉండే హీరో హెల్ప్ తీసుకుంటాడు….కానీ తర్వాత ఆ ఇంటిలో ఎదో మిస్టరీ ఉందని తెలిసి ఆ ఇంటిని వదలాలని ఎంత ట్రై చేసినా కూడా అదేమీ జరగదు, దానికి కారణం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే…. మొత్తం మీద సినిమా కథ బాగుండగా స్క్రీన్ ప్లే అండ్ ఎడిటింగ్ కొన్ని చోట్ల డ్రాగ్ అవుతూ…
కొన్ని చోట్ల రిపీటివ్ గా అనిపించడంతో కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా చాలా చోట్ల సినిమా థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకోవడంతో ఎలాంటి ఎక్స్ పెర్టేషన్స్ లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి కొంచం బోర్ ఫీల్ అయ్యేలా చేసినా కూడా ఓవరాల్ గా ఒక డిఫెరెంట్ ఎక్స్ పీరియన్స్ ను అయితే కలిగేలా చేస్తుంది అని చెప్పొచ్చు….
మలయాళ ఆడియన్స్ టేస్ట్ కి సినిమా ఎక్కువ పాజిటివ్ గా అనిపించినా ఇక్కడ ఆడియన్స్ టేస్ట్ ప్రకారం చూస్తె సినిమా ఎబో యావరేజ్ కి అటూ ఇటూగా ఉందని చెప్పాలి… ముందే చెప్పినట్లు ఎలాంటి అంచనాలు లేకుండా వెళ్ళే ఆడియన్స్ కి సినిమా ఎబో యావరేజ్ లెవల్ లో అనిపించడం ఖాయం… ఇక ఇక్కడ సినిమాకి ఎలాంటి వసూళ్లు సొంతం అవుతాయో చూడాలి.