Home న్యూస్ బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు…ఇదేమి బ్యాటింగ్ సామి!!

బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు…ఇదేమి బ్యాటింగ్ సామి!!

0

     కోలివుడ్ స్టార్ హీరో ఇలయ దళపతి విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ విజిల్ బాక్స్ ఆఫీస్ దగ్గర రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో సెన్సేషన్ ని క్రియేట్ చేస్తూ దూసుకు పోతుంది, సినిమా దీపావళి వీకెండ్ లో అటు తమిళ్ లోనే కాదు, తెలుగు రాష్ట్రాలలో, పక్క రాష్ట్రం కర్ణాటక మరియు కేరళ లో కూడా అల్టిమేట్ కలెక్షన్స్ తో విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డులు నమోదు చేస్తూ దూసుకుపోతుంది.

సినిమా 6 రోజుల్లోనే 200 కోట్ల గ్రాస్ మార్క్ ని వరల్డ్ వైడ్ గా అందుకుని విజయ్ కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ ను నమోదు చేసింది, ఇక 9 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 240 కోట్ల లోపు గ్రాస్ ని వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. బాక్ టు బాక్ 200 కోట్ల సినిమాలతో విజయ్….

సంచలన రికార్డ్ ను నమోదు చేశాడు అని చెప్పొచ్చు. 2017 లో మెర్సల్ సినిమాతో మొదటి సారిగా 200 కోట్ల క్లబ్ లో ఎంటర్ అయిన విజయ్ లాస్ట్ ఇయర్ సర్కార్ సినిమా తో మరోసారి 200 కోట్ల రేంజ్ ని అందుకుని సంచలనం సృష్టించాడు. కాగా ఇప్పుడు బిగిల్ సినిమా…

అన్ని సినిమాల రికార్డులను బ్రేక్ చేస్తూ కేవలం 9 రోజుల్లోనే 240 కోట్ల లోపు గ్రాస్ ని అందుకోవడం తో త్వరలోనే సినిమా విజయ్ కెరీర్ లో టాప్ ప్లేస్ ని సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు. సినిమా సెకెండ్ వీకెండ్ లో కూడా స్టడీ కలెక్షన్స్ తో రన్ అవుతుండటం విశేషం కాగా…

ఎలాగు మరో వారం 10 రోజులు పెద్దగా కొత్త సినిమాలు లేవు కాబట్టి సినిమా తమిళ్ వర్షన్ స్ట్రాంగ్ గానే ఉండటం తో ఇప్పుడు ఫైనల్ రన్ లో 270 కోట్ల నుండి 280 కోట్ల రేంజ్ గ్రాస్ ని వరల్డ్ వైడ్ గా అందుకునే అవకాశం ఉందని అంటున్నారు. మరి ఫైనల్ రన్ లో సినిమా ఎంతవరకు కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here