బాక్స్ ఆఫీస్ దగ్గర అతనొక్కడే పటాస్ లాంటి బ్లాక్ బస్టర్ లను చాలా గ్యాప్ తర్వాత సొంతం చేసుకున్న హీరో కళ్యాణ్ రామ్ రీసెంట్ టైం లో ఒక్క 118 సినిమా తో మాత్రమె ఆడియన్స్ మనసును గెలుచుకున్నాడు. ఆ సినిమా పర్వాలేదు అనిపించే హిట్ ని సొంతం చేసుకోగా తర్వాత చేసిన ఎంతమంచి వాడవురా బాక్స్ ఆఫీస్ దగ్గర బొక్క బోర్లా పడగా ఆల్ మోస్ట్ ఏడాదిన్నర నుండి కొత్త సినిమాలను అనౌన్స్ చేయని…
కళ్యాణ్ రామ్ రీసెంట్ గా అందరికీ శాకిస్తూ ఏకంగా మైతలాజికల్ కథతో బింబిసర అంటూ భారీ యాక్షన్ మూవీ ని అనౌన్స్ చేసి ఫస్ట్ లుక్ ని కూడా రివీల్ చేశాడు. ఫస్ట్ లుక్ కి టైటిల్ కి ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఏర్పడగా ఈ సినిమా….
ఏకంగా 3 భాగాలుగా ఆడియన్స్ ముందుకు వస్తుంది అంటూ ఇండస్ట్రీ లో వార్తలు శిఖారు చేయగా మేకర్స్ కూడా ఈ వార్తలకు కొట్టిపారేయలేదు కానీ మొదటి పార్ట్ విజయం పై మిగిలిన పార్టులు ఆధారపడి ఉంటాయాని అంటున్నారు. ఇక ఈ సినిమా భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా అంటూ…
ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పుడు వార్తలు చక్కర్లు కొట్టాయి. ఏకంగా 45 కోట్ల భారీ బడ్జెట్ తో భారీ విజువల్ వండర్ గా ఈ సినిమా రూపొందుతుందని చెప్పగా లేటెస్ట్ గా అందరికీ ఒకింత శాకిస్తూ ఈ సినిమా బడ్జెట్ చాలా తక్కువలో రూపొందుతుందని అంటున్నారు. 45 కోట్లు అనుకున్న బడ్జెట్ ఒక్క పార్టు కే అనుకుంటే అలా కాదని మొత్తం మీద ఈ ప్రాజెక్ట్ 3 పార్టులు కలిపి…
ఆ బడ్జెట్ అనుకుంటున్నారని లేటెస్ట్ టాలీవుడ్ టాక్, కళ్యాణ్ రామ్ ఓన్ బ్యానర్ కాబట్టి రెమ్యునరేషన్ ఏమి తీసుకోవడం లేదని, టోటల్ బడ్జెట్ ప్రొడక్షన్ కే పెడుతున్నాడని అంటున్నారు. మైతలాజికల్ మూవీ అంటే భారీ హంగులు ఉంటాయి, మరి ఆ బడ్జెట్ లో సినిమా ఎంతవరకు క్వాలిటీ ని కలిగి ఉంటుంది అనేది ఇప్పుడు ఆసక్తి కరం అని చెప్పొచ్చు.