ఇండియన్ సినిమా అంటే వరల్డ్ వైడ్ సినీ ఆడియన్స్ కి ముందు గుర్తుకు వచ్చే ఇండస్ట్రీ బాలీవుడ్….ఇండియాలోనే అన్ని ఇండస్ట్రీలలో బిగ్గెస్ట్ మార్కెట్ ఉన్న ఇండస్ట్రీ కూడా బాలీవుడ్ అనే చెప్పాలి…సౌత్ ఇండస్ట్రీ ఇప్పుడు వరుస విజయాలతో తమ మార్కెట్ ను పెంచుకుంటూ ఉండగా బాలీవుడ్ లో సరైన సినిమా పడితే…
అవలీలగా కలెక్షన్స్ వరదలా వస్తాయి అని లాస్ట్ ఇయర్ వచ్చిన పఠాన్, జవాన్, యానిమల్, గదర్2 లాంటి సినిమాలు నిరూపించాయి. కానీ ఈ టైంలో చాలా సినిమాల కలెక్షన్స్ అనుకున్న రేంజ్ లో అయితే రావడం లేదు…రీసెంట్ గా వచ్చిన బడే మియా చోటే మియా, మైదాన్ లాంటి సినిమాలు బడ్జెట్ కి ఏమాత్రం న్యాయం అయితే చేయలేక పోయాయి…
అలానే ప్రతీ చిన్న టు మీడియం రేంజ్ మూవీ కి కూడా కోట్లు కోట్లు బడ్జెట్ పెట్టి రెమ్యునరేషన్ కింద కోట్లు కోట్లు తీసుకుంటూ ఉండటం, అవి బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోవడంతో ఈ సమ్మర్ లో బాలీవుడ్ పెద్దలు అందరూ కూర్చుని పరిస్థితుల పై చర్చలు మీటింగ్ లు చేసుకుంటున్నారట…
ఈ మీటింగ్స్ లో సినిమాల బడ్జెట్ లు చాలా వరకు తక్కువ చేసుకోవాలని, అలాగే డైరక్టర్స్, హీరోల రికార్డ్ రెమ్యునరేషన్ లు తగ్గించుకోవాలి అన్న నిర్ణయాలు తీసుకుంటున్నారట. దీనిపై ఖాన్ హీరోలు ఆల్ రెడీ సమ్మతం తెలపగా ఇప్పటి వరకు సెట్స్ పైన ఉన్న సినిమాలను పక్కకు పెట్టేసి…
ఇక మీదట రూపొందే సినిమాల బడ్జెట్ అండ్ రెమ్యునరేషన్ లు కంట్రోల్ చేయాలని నిర్ణయం తీసుకుంటున్నారట. అలాగే మంచి కథల మీద ఫోకస్ చేస్తూ బాలీవుడ్ ను తిరిగి మునుపటి రోజుల రేంజ్ సక్సెస్ లను దక్కించుకునేలా చేయాలనీ భావిస్తున్నారట…మరి ఈ నిర్ణయాలు అన్నీ అమలులోకి వచ్చి బాలీవుడ్ మునుపటిలా జోరు చూపిస్తుందో లేదో చూడాలి ఇక…