బొమ్మరిల్లు అనే సినిమాతో ఓవర్ నైట్ లో క్రేజీ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న భాస్కర్ బొమ్మరిల్లు భాస్కర్ గా మారిపోయాడు, తర్వాత చేసిన పరుగు కూడా సూపర్ హిట్ అవ్వగా తర్వాత ఆరెంజ్ సినిమా మాత్రం పర్వాలేదు అనిపించినా ఆ టైం కి ఉన్న అంచనాలను అందుకోలేక డిసాస్టర్ అవ్వగా తర్వాత చేసిన ఒంగోలు గిత్త సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఇంపాక్ట్ చూపేలేక ఫ్లాఫ్ మూవీ గా నిలిచింది…
దాంతో అప్పటి నుండి టాలీవుడ్ లో మరో ఛాన్స్ సొంతం చేసుకోలేక పోయిన భాస్కర్ తమిళ్ లో బెంగళూర్ నాట్కాల్ అనే సినిమా చేశాడు కానీ అది కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు, ఇలాంటి టైం లో కెరీర్ లో ఒక్క అవకాశం కూడా సొంతం చేసుకోలేక పోయిన భాస్కర్…
కెరీర్ మొదలు పెట్టి 3 సినిమాలు చేసినా హిట్ అందుకోలేక పోయిన అఖిల్ అక్కినేని తో గీతా ఆర్ట్స్ బ్యానర్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా ఛాన్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు ఈ సినిమా తో ఆడియన్స్ ను మెప్పించి మంచి మార్కులు సొంతం చేసుకున్న భాస్కర్…
ఈ సినిమా కి గాను తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత అనేది ఆసక్తిగా మారగా అంతకుముందు వరకు సినిమా కి ఇంత అని రెమ్యునరేషన్ తీసుకున్న భాస్కర్ కి ఈ సినిమా కోసం నెల జీతం కోసం పని చేశారని సమాచారం. నెలకి 2 లక్షల చొప్పున రెమ్యునరేషన్ పరంగా ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు కూడా గీతా ఆర్ట్స్ వాళ్ళు భాస్కర్ కి రెమ్యునరేషన్ ఇచ్చారట.
లాస్ట్ ఇయరే రిలీజ్ అనుకున్న ఈ సినిమా పోస్ట్ పోన్ అవుతూ ఈ ఇయర్ సమ్మర్ అనుకున్నా మళ్ళీ పోస్ట్ పోన్ అయ్యి ఎట్టకేలకు రీసెంట్ గా రిలీజ్ అవ్వగా ఓవరాల్ గా వేవ్ ల వలన ఇబ్బంది వచ్చినా ప్రతీ నెల రెమ్యునరేషన్ ఇచ్చారట. ఇక ఇప్పుడు హిట్ కొట్టాడు కాబట్టి బోనస్ కూడా వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.