ఉస్తాద్ రామ్ పోతినేని(Ram Pothineni) నటించిన లేటెస్ట్ మూవీ స్కంద(Skanda Movie) తీసిన డైరెక్టర్ బోయపాటి శ్రీను(Boyapati sreenu) బాక్స్ ఆఫీస్ దగ్గర వరుస పెట్టి సినిమాలు చేస్తూ ఉండగా బాలయ్య(Balakrishna) తో సక్సెస్ లను సొంతం చేసుకోగా రీసెంట్ టైం లో…
చేసిన వినయ విదేయ రామ, జయ జానకి నాయక, మరియు ఇప్పుడు వచ్చిన స్కంద సినిమాలు అనుకున్న రేంజ్ లో అంచనాలను అందుకోలేదు…. అయినా కానీ సినిమా సినిమాకి తన రేంజ్ ని పెంచుకుంటున్న బోయపాటి శ్రీను…
అఖండ(Akhanda) లాంటి భారీ బ్లాక్ బస్టర్ తర్వాత చేసిన స్కంద మూవీని భారీగా తెరకెక్కించగా ఈ సినిమా కోసం బోయపాటి తీసుకున్న రెమ్యునరేషన్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఆల్ మోస్ట్ స్టార్స్ రేంజ్ లో రెమ్యునరేషన్ ని ఈ సినిమాతో బోయపాటి…
తీసుకున్నాడని అంటున్నారు… ఆల్ మోస్ట్ 15 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ని బోయపాటి శ్రీను తీసుకున్నట్లు సమాచారం. సినిమాకి ఓవరాల్ గా రిలీజ్ కి ముందే థియేట్రికల్ అండ్ నాన్ థియేట్రికల్ రైట్స్ ద్వారా సాలిడ్ బిజినెస్ ను సొంతం చేసుకోగా…
ఈ సినిమా కోసం ఈ రేంజ్ లో రెమ్యునరేషన్ ని అందుకోవడం ఎక్కువేమి కాదని చెప్పొచ్చు, కానీ బోయపాటి రీసెంట్ టైంలో చేస్తున్న సినిమాల స్టోరీ పాయింట్ కొంచం సిమిలర్ గానే ఉంటూ వస్తుండగా ఫ్యూచర్ సినిమాలకు కథ పాయింట్ చేంజ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పాలి.