బ్రోచేవారెవరురా కలెక్షన్స్: అమ్మింది 2 కోట్లు….10 రోజుల్లో వచ్చింది ఇది!!

1
2114

చిన్న సినిమా బ్రోచేవారెవరురా బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి 10 రోజులు కాగా సినిమా మంచి విజయాన్ని అందుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర సత్తా చాటుకుంది, చిన్న సినిమా నే అయినా పబ్లిసిటీ బాగా చేయడం మౌత్ టాక్ బాగుండటం తో సినిమా కి అద్బుతమైన కలెక్షన్స్ ఇప్పటి వరకు దక్కాయి.

సినిమా మొత్తం మీద 10 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాలలో 3.27 కోట్ల షేర్ మార్క్ ని అందుకుంది, ఇక వరల్డ్ వైడ్ గా 10 రోజులకు గాను 4.09 కోట్ల షేర్ మార్క్ ని అందుకుని సత్తా చాటుకుంది. దాంతో సినిమా బ్రేక్ ఈవెన్ ని పూర్తి చేసుకుని సూపర్ హిట్ గా నిలిచింది.

సినిమాను టోటల్ గా 2 కోట్ల రేంజ్ లో అమ్మగా 2.6 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన సినిమా ఇప్పటి వరకు 1.49 కోట్ల లాభాన్ని సొంతం చేసుకుంది. లాంగ్ రన్ లో మరింత జోరుగా కలెక్షన్స్ ని అందుకుని దుమ్ము లేపే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here