Home న్యూస్ రాయలసీమలో 15 కోట్లు…ఆల్ టైమ్ 4

రాయలసీమలో 15 కోట్లు…ఆల్ టైమ్ 4

0

  రెండు తెలుగు రాష్ట్రాలలో మంచి ఫాలోయింగ్ ఉన్న హీరోలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఒకరు… ప్రస్తుతం కెరీర్ లో బిగ్గెస్ట్ లెవల్ లో క్రేజ్ ని ఎంజాయ్ చేస్తున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన లేటెస్ట్ మూవీ అరవింద సమేత బాక్స్ ఆఫీస్ దగ్గర అల్టిమేట్ కలెక్షన్స్ తో 9 రోజుల్లోనే సరికొత్త రికార్డులను నమోదు చేసిన విషయం తెలిసిందే. సినిమా రాయలసీమ ఏరియా లో ఆల్ టైమ్ రికార్డులను నమోదు చేసింది.

ఇప్పటి వరకు వచ్చిన కలెక్షన్స్ తో అక్కడ 15.2 కోట్ల షేర్ మార్క్ ని అధిగమించి అక్కడ ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ ని దక్కించుకుని సత్తా చాటింది. బాహుబలి సిరీస్ మరియు రంగస్థలం తర్వాత ప్లేస్ ని కేవలం 9 రోజుల లోపే సాధించడం అంటే మామూలు భీభత్సం కాదు.

కాగా అక్కడ రంగస్థలం టోటల్ రన్ లో 17.6 కోట్లకు పైగా షేర్ ని అందుకోగా ఇప్పుడు అరవింద సమేత ఆ రికార్డ్ పై కన్నెసింది. త్వరలోనే ఆ రికార్డ్ ను బ్రేక్ చేసే అవకాశం అయితే పుష్కలంగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. మరి అందుకుంటుందో లేదో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here