Home న్యూస్ వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…ఈ రికార్డులేంటి సామి!!

వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు…ఈ రికార్డులేంటి సామి!!

0

  సోషల్ మీడియా రికార్డుల విషయంలో టాలీవుడ్ అండ్ కోలీవుడ్ పోటా పోటీ గా దూసుకు పోతున్నా… కొన్ని విషయాలలో కోలీవుడ్ టాలీవుడ్ ని మించే విధంగా ఉందని చెప్పొచ్చు. టీసర్ల విషయం లో కోలీవుడ్ ఫ్యాన్స్ నెలకొల్పిన రీసెంట్ రికార్డులను చూస్తే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే అని చెప్పాల్సిందే… మెర్సల్ టీసర్ నెలకొల్పిన రికార్డులు ఇప్పటికీ కొనసాగుతుంటే ఇప్పుడు విజయ్ నటించిన లేటెస్ట్ మూవీ సర్కార్ టీసర్ మరిన్ని భీభత్సాలు నమోదు చేసింది.

ఈ సినిమా టీసర్ నిన్న రిలీజ్ అవ్వగా యూట్యూబ్ లో వ్యూస్ తో పాటు లైక్స్ కూడా స్ట్రక్ అయ్యాయి. వ్యూస్ స్ట్రక్ అవ్వడం మామూలే కానీ లైక్స్ బటన్ స్ట్రక్ అవ్వడం అంటే మామూలు ఊచకోత కాదనే చెప్పాలి.  కేవలం 45 నిమిషాల్లో 5 లక్షల 75 వేల లైక్స్ ని సాధించగా….

యూట్యూబ్ అప్ డేట్ చేసే సమయానికి 5 గంటల్లో 1 మిలియన్ లైక్స్ ని 9 మిలియన్ వ్యూస్ ని సొంతం చేసుకుంది. ఇక ఇప్పుడు 24 గంటల్లో 1.2 మిలియన్ కి పైగా లైక్స్ ని 1.5 మిలియన్ వ్యూస్ ని కంప్లీట్ చేసుకుని ఆల్ టైమ్ ఇండస్ట్రీ రికార్డులను నమోదు చేసింది.. ఇది చూసిన ఇతర ఇండస్ట్రీల వాళ్ళు వీళ్ళెం ఫ్యాన్స్ రా బాబు.. ఈ రికార్డులేంటి సామి అని అనుకుంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here