ఆల్ టైం రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్ తో వరల్డ్ వైడ్ గా ఓ రేంజ్ లో కుమ్మేస్తూ దూసుకు పోతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన సెన్సేషనల్ మూవీ పుష్ప2(Pushpa2 The Rule Movie), హిందీలో ఊరమాస్ జోరు తో మాస్ కుమ్ముడు కుమ్ముతూ రికార్డులు చెల్లాచెదురు చేస్తూ ఉండగా తెలుగు రాష్ట్రాల్లో కూడా…
రిమార్కబుల్ ట్రెండ్ ను చూపెడుతూ సాలిడ్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేస్తుంది…సినిమా మీద మొదటి నుండి అన్ని ఏరియాల్లో కుమ్మేస్తుంది అని తెలిసినా సీడెడ్ ఏరియాలో రీసెంట్ టైంలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హోల్డ్ తో రిమార్కబుల్ లాంగ్ రన్ ను ఎంజాయ్ చేసిన పుష్ప2 మూవీ…
ఇప్పుడు ఇక్కడ మరో బిగ్గెస్ట్ రికార్డ్ ను అందుకుంది…ఏడున్నర ఏళ్ల క్రితం ఇక్కడ ఆల్ టైం ఎపిక్ కలెక్షన్స్ తో చరిత్ర సృష్టించిన బాహుబలి2 రికార్డ్ కలెక్షన్స్ ని బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది… రాజమౌళి డైరెక్షన్ లోనే వచ్చిన ఆర్ ఆర్ ఆర్ మూవీ…
ఇక్కడ బాహుబలి2 ని దాటేసి కొత్త రికార్డ్ ను నమోదు చేసినా కూడా నాన్ రాజమౌళి మూవీస్ అన్నింటిలోకి దేవర 30 కోట్ల షేర్ మార్క్ ని దాటితే ఇప్పుడు ఆ మార్క్ ని ఎప్పుడో దాటేసి ఇప్పుడు ఏకంగా రాజమౌళి ఎపిక్ వండర్ అయిన బాహుబలి2 రాయలసీమ టోటల్ షేర్ ని…..
పుష్ప2 మూవీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…బాహుబలి2 టోటల్ రన్ లో సీడెడ్ ఏరియాలో 34.75 కోట్ల షేర్ ని అందుకోగా ఇప్పుడు 32 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో ఈ మార్క్ ని దాటేసిన పుష్ప2 మూవీ సీడెడ్ లో 35 కోట్ల ఎపిక్ షేర్ మార్క్ ని అందుకున్న…
రెండో సినిమాగా చరిత్రలో నిలిచిపోయింది…..ఎపిక్ లాంగ్ రన్ లో అనేక రికార్డులను నమోదు చేసిన పుష్ప2 మూవీ సీడెడ్ లో చూపించిన ఈ జోరు ఇప్పట్లో ఇతర బిగ్ పాన్ ఇండియా మూవీస్ అందుకోవడం తలకిమించిన భారం అనే చెప్పాలి. ఇక ఫైనల్ రన్ లో సినిమా ఎలాంటి కలెక్షన్స్ ని అందుకుంటుందో చూడాలి.