బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు డబ్ కన్నడ మూవీ కాంతార రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సినిమా కి తెలుగు రాష్ట్రాల్లో సెన్సేషనల్ రెస్పాన్స్ దక్కుతూ ఉండగా అనుకున్న దానికి మించి కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటున్న ఈ సినిమా స్ట్రైట్ మూవీ అయిన గాడ్ ఫాదర్ ని ఈ వీకెండ్ లో పూర్తిగా డామినేట్ చేసి వర్కింగ్ డేస్ లో కూడా ఫుల్ లీడ్ ని సొంతం చేసుకుని దూసుకు పోతుంది.
సినిమా ఇక ఓన్ స్టేట్ అయిన కర్ణాటకలో రెండో వీక్ లో మొదటి వీక్ కి మించి వసూళ్ళని సొంతం చేసుకోగా దసరా టైం లో ఎలాగోలా అక్కడ కాంతారని తట్టుకుని వీకెండ్ వరకు వసూళ్ళని సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్ సినిమా..
తర్వాత కాంతార సినిమా కి ఆడియన్స్ లో ఉన్న డిమాండ్ వలన షోలు భారీగా పెంచగా గాడ్ ఫాదర్ షోలు భారీగా తగ్గించక తప్పలేదు, దాంతో రెండో వీకెండ్ లో అక్కడ చాలా తక్కువ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్న గాడ్ ఫాదర్…
ఇప్పుడు అక్కడ కూడా బ్రేక్ ఈవెన్ ని అందుకోవడం కష్టంగానే మారింది, కర్ణాటకలో మొదటి వారం 4.50 కోట్లు వసూల్ చేసిన గాడ్ ఫాదర్ రెండో వారంలో అతి కష్టం మీద 20 లక్షల లోపు షేర్ ని మాత్రమే సొంతం చేసుకోవడం అక్కడ కాంతార ఏ రేంజ్ లో దెబ్బ కొట్టింది అన్న దానికి నిదర్శనం. అక్కడ గాడ్ ఫాదర్ కి 6 కోట్ల బిజినెస్ జరగగా ఇప్పుడు నష్టాలు కన్ఫాం అనే చెబుతున్నారు.