Home న్యూస్ చిత్రలహరి డే 6 కలెక్షన్స్…బ్రేక్ పడింది!!

చిత్రలహరి డే 6 కలెక్షన్స్…బ్రేక్ పడింది!!

0

  మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ నటించిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి 5 రోజుల్లో టోటల్ వరల్డ్ వైడ్ గా 12.44 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుని సత్తా చాటుకుంది, సినిమా కి మరీ అద్బుతమైన టాక్ రాకున్నా కానీ యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్ మనసు గెలుచుకోవడం తో సినిమా వీకెండ్ లో కుమ్మగా తర్వాత వర్కింగ్ డేస్ లో కూడా స్టడీ కలెక్షన్స్ ని అందుకుంటుంది.

కాగా సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ తో ముగించే దిశగా అడుగులు వేస్తుంది, సినిమా 6 వ రోజు మొత్తం మీద 60 లక్షల నుండి 70 లక్షల మధ్యలో షేర్ ని అందుకునే అవకాశం ఉందని అంటున్నారు.

ఇది మరీ గొప్ప కాకున్నా కానీ బిజినెస్ తక్కువ అవ్వడం తో డీసెంట్ అనే చెప్పాలి, ఇక సినిమా 6 వ రోజు వసూళ్ళతో బిజినెస్ మార్క్ 12.5 కోట్లకి బ్రేక్ వేసింది, ఇక 7 వ రోజు సాధించే వసూళ్ళతో చిత్రలహరి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర క్లీన్ హిట్ గా నిలుస్తుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here