Home న్యూస్ మజిలీ డే 13 కలెక్షన్స్..ఆగని జోరు!

మజిలీ డే 13 కలెక్షన్స్..ఆగని జోరు!

0

  యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య నటించిన లేటెస్ట్ మూవీ మజిలీ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపుతూ దూసుకు పోతూనే ఉంది, సినిమా ఇప్పటికే బాక్స్ ఆఫీస్ టార్గెట్ ని మించిపోయి భారీ బ్లాక్ బస్టర్ గా నిలవగా ఇప్పటికీ స్లో డౌన్ అవ్వకుండా వర్కింగ్ డేస్ లో కూడా డీసెంట్ కలెక్షన్స్ తో రన్ అవుతుంది, కానీ సినిమా ఇప్పుడు 40 కోట్ల టార్గెట్ ని ఫిక్స్ చేసుకోవడం తో జోరు మరింత పెరగాల్సిన అవసరం ఉంది.

సినిమా 13 వ రోజున రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి డీసెంట్ కలెక్షన్స్ ని అందుకుంది, ట్రేడ్ లెక్కల్లో 30 లక్షల రేంజ్ లో సినిమా బిజినెస్ ని సొంతం చేసుకుందని సమాచారం. ఇప్పటికే 12 కోట్లకు పైగా ప్రాఫిట్స్ తో బ్లాక్ బస్టర్ అనిపించుకున్న మజిలీ….

40 కోట్ల క్లబ్ లో చేరాలి అంటే మాత్రం మూడో వీకెండ్ లో కూడా జోరు చూపాలి. ఏది ఏమైనా సినిమా ఇప్పటికే భారీ లాభాల భాట పట్టగా ఈ మార్క్ ని కూడా అందుకుంటే టార్గెట్ సంపూర్ణం అవుతుంది అని చెప్పాలి. ఇక 13 రోజుల అఫీషియల్ కలెక్షన్స్ లెక్కలు ఎలా ఉంటాయో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here