నార్త్ వాళ్ళు సౌత్ మూవీస్ అంటే ఎప్పుడూ కొంచం చిన్న చూపు చూస్తారు… ఇప్పుడు అది కొంచం తగ్గినా కానీ బాలీవుడ్ ట్రోల్ ఛానెల్స్ చాలా వరకు సౌత్ మూవీస్ లో యాక్షన్ సీన్స్ ని చూపి ఇవేమీ యాక్షన్ సీన్స్ రా బాబు అంటూ కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేయడం కామన్ అని చెప్పాలి. ఈ మధ్య తెలుగు లో ఇవి కొంచం తగ్గినా కానీ రామ్ చరణ్ నటించిన వినయ విదేయ రామ సినిమా లో ట్రైన్ సీన్ చూసి…
ఇక్కడ ఎలా ట్రోల్ చేశారో బాలీవుడ్ లో డబుల్ ట్రిబుల్ ట్రోల్ చేశారు… మా బాలీవుడ్ లో ఇలాంటి సీన్స్ ఉండవు అంటూ గొప్పలు చెప్పుకున్న బాలీవుడ్ వాళ్లకి రీసెంట్ గా ఒక సినిమా దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది, ఆ సినిమానే వరుణ్ ధవన్ నటించిన కూలీ నంబర్ 1 సినిమా…
ఈ సినిమా లో ఒక ట్రైన్ సీన్ ఉంటుందీ అది ఇప్పుడు సోషల్ మీడియా లో మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అని చెప్పాలి. ఒక పిల్లోడికి ఆటబొమ్మ ట్రైన్ పట్టాల పై కనిపిస్తుంది, అది తెచ్చుకుందామని దిగి ఆ ట్రైన్ ట్రాక్ ఎక్కుతాడు, ఆ బొమ్మ తెచ్చుకూవాలా తెచ్చుకోకుండా ఆ ట్రాక్ మిడిల్ లో కూర్చుని…
ఆ బొమ్మ తో ఆడుకుంటూ ఉంటాడు… ఆ సీన్ ని వెనక ఎక్కడో ఉన్న హీరో చూసి ట్రైన్ వస్తుంది అని గమనించి ట్రైన్ స్పీడ్ గా వెళుతున్నా కానీ దాని పై దూకి ట్రైన్ స్పీడ్ ని కూడా దాటేసి ఆ కుర్రాడిని కాపాడతాడు, ట్రైన్ చప్పుడు కూడా వినకుండా ఆ కుర్రాడు ఆ బొమ్మతో ఆడుకుంటాడు… ఆ సీన్ ని ఎలా డిసైన్ చేశారో, ఎందుకు తీశారో తెలియదు కానీ సినిమాలో మిగిలిన వేస్ట్ సీన్స్ ఎక్కువే ఉన్నా కానీ…
ఈ సీన్ ని చూసి సౌత్ వాళ్ళే కాదు సినిమా ను హేట్ చేసిన ప్రతీ ఒక్కరూ కూడా ఓ రేంజ్ లో దుమ్మెత్తి పోస్తున్నారు. ఇంత లాజిక్ లెస్ సీన్ ని ట్రోల్ అవుతాం అని తెలిసినా ఎందుకు పెట్టారో డైరెక్టర్ అండ్ హీరో కే తెలియాలి… ఇక సినిమా ఈ ట్రోల్స్ వలన అనుకుంటే సాలిడ్ వ్యూస్ తో అమెజాన్ ప్రైమ్ లో దుమ్ము లేపేలా దూసుకు పోతుంది…