Home న్యూస్ తోడేలు మూవీ రివ్యూ- రేటింగ్!!

తోడేలు మూవీ రివ్యూ- రేటింగ్!!

0

వరుణ్ ధవన్ కృతి సనన్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ భేడియా తెలుగు లో తోడేలు పేరుతో డబ్ అయ్యి భారీగానే రిలీజ్ ను సొంతం చేసుకుంది. ట్రైలర్ రిలీజ్ తర్వాత సినిమా పై మంచి బజ్ ఏర్పడింది అని చెప్పాలి. మరి ఇప్పుడు భారీగా రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుని మెప్పించిందో తెలుసుకుందాం పదండీ… ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే…

సివిల్ ఇంజనీర్ అయిన హీరో రోడ్ కాంట్రాక్ట్ కోసం అరుణాచల్ ప్రదేశ్ వెళతాడు, అక్కడ అడవిలో కొన్ని అనుకోని పరిస్థితుల్లో అనుకోకుండా ఒక తోడేలు హీరోని కొరుకుతుంది, ఆ తర్వాత హిరోలో మార్పులు వస్తూ తాను కూడా తోడేలు అవుతాడు, తర్వాత ఏం చేశాడు, ఇంతకీ హీరో తోడేలు అవ్వడానికి కారణం ఏంటి అనేది సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

కథ ఓవరాల్ పాయింట్ చాలా ఆసక్తిగా ఉండగా కొన్ని సీన్స్ కూడా డైరెక్టర్ బాగా డీల్ చేశాడు కానీ లెంత్ ఎక్కువ అవ్వడం, స్క్రీన్ ప్లే అంత పకడ్బందీగా లేక పోవడంతో కొంచం ఎక్కువ సేపే సినిమా బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది. ఇక వరుణ్ ధవన్ తన రోల్ లో అదరగొట్టగా కృతి సనన్ లుక్ ఏదోలా ఉంది, మిగిలిన యాక్టర్స్ పర్వాలేదు… ఫస్టాఫ్ వరకు కథ చాలా ఆసక్తిగా సాగగా…

సెకెండ్ ఆఫ్ కి వచ్చే సరికి మెయిన్ పాయింట్ తెలిసిపోయాక సినిమా మరింత స్లో అవుతుంది, ప్రీ క్లైమాక్స్ నుండి ఇంకా రొటీన్ గానే అనిపించగా సినిమా పోస్ట్ క్రెడిట్ సీన్స్ లో స్త్రీ సినిమాకి లింక్ చేసిన సీన్స్ బాగుండగా ఓవరాల్ గా సినిమా మొత్తం మరీ అంచనాలను అందుకోక పోయినా కానీ చాలా వరకు కథ ఆకట్టుకునే ఉండటం…

ఒక డిఫెరెంట్ టైప్ ఆఫ్ కాన్సెప్ట్ ను చాలా వరకు ఎంగేజింగ్ గా డైరెక్టర్ చెప్పే ప్రయత్నం చేయడం, 3D ఎఫెక్ట్ కూడా బాగుండటంతో ఒకసారి ఈజీగా సినిమా చూడొచ్చు అనిపించేలా మెప్పిస్తుంది తోడేలు, లెంత్ కొంచం తగ్గించి థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ మరిన్ని జోడించి ఉంటే సినిమా ఇంకా బాగుండేది. మొత్తం మీద సినిమాకి మా రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here