Home టోటల్ కలెక్షన్స్ 2.25 కోట్ల టార్గెట్…తోడేలు టోటల్ తెలుగు కలెక్షన్స్ ఇవే!!

2.25 కోట్ల టార్గెట్…తోడేలు టోటల్ తెలుగు కలెక్షన్స్ ఇవే!!

0

వరుణ్ ధవన్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ భేడియా తెలుగు లో తోడేలు పేరుతో డబ్ అవ్వగా గీతా ఆర్ట్స్ వాళ్ళు ఈ సినిమాను తెలుగు లో రిలీజ్ చేశారు. కాగా సినిమా ఓవరాల్ వాల్యూ బిజినెస్ 2 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 2.25 కోట్ల రేంజ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగగా ఇక్కడ అనుకున్న రేంజ్ లో పెర్ఫార్మ్ చేయలేక పోయింది ఈ సినిమా… మొదటి వీకెండ్ లో….

సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మొత్తం మీద 90 లక్షల రేంజ్ లో గ్రాస్ ను వసూల్ చేయగా మిగిలిన రన్ లో సినిమా మరో 60 లక్షల లోపు గ్రాస్ ను వసూల్ చేసింది. దాంతో టోటల్ రన్ లో సినిమా 1.50 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను 80 లక్షల లోపు షేర్ ని…

సొంతం చేసుకుని పరుగును పూర్తీ చేసుకుంది. సినిమా 2.25 కోట్ల టార్గెట్ లో ఆల్ మోస్ట్ 1.45 కోట్ల రేంజ్ లో నష్టపోయి బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా పరుగును ముగించింది. హిందీ లో కూడా సినిమా అతి కష్టం మీద 55 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది.

మంచి టాక్ నే సొంతం చేసుకున్నా కానీ ఎందుకనో జనాలు వరుణ్ ధవన్ సినిమాను చూడటానికి పెద్దగా ఆసక్తిని చూపించ లేదు. దాంతో ఇటు తెలుగు లో అటు హిందీ లో ఎక్కడా కూడా సినిమా కి ఆశించిన కలెక్షన్స్ సొంతం అవ్వలేదు అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here