స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపి ఆల్ మోస్ట్ 2 ఏళ్ళు అవుతుండగా ఇప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జులాయి సన్ ఆఫ్ సత్యమూర్తి తర్వాత చేస్తున్న మూడో సినిమా అల వైకుంఠ పురంలో భారీ ఎత్తున మరి కొన్ని గంటల్లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతుంది. ఇక సినిమా మొదటి రోజు ఓవరాల్ థియేటర్స్ కౌంట్ రేపే రివీల్ కానుంది, దానికి కారణం సంక్రాంతి క్లాష్.
ఓవరాల్ గా మరీ భారీ సంఖ్యలో కాకున్నా సంక్రాంతి క్లాష్ లో మొదటి రోజు ఈ సినిమా కి రెండు తెలుగు రాష్ట్రాలలో 750 కి పైగా థియేటర్స్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంది, ఇక ఈ థియేటర్స్ లో మెయిన్ సెంటర్స్ బుకింగ్స్ ఇంకా ఓపెన్ కాలేదు. కానీ ఓపెన్ అయిన…
సెంటర్స్ లో బుకింగ్స్ మాత్రం అల్టిమేట్ లెవల్ లో కొనసాగుతుంది, ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పటి వరకు ఓపెన్ అయిన థియేటర్స్ 450 నుండి 480 వరకు ఉండగా ఆ థియేటర్స్ లో బుకింగ్స్ ఆల్ మోస్ట్ 75% రేంజ్ లో జరగడం సినిమా క్రేజ్ నిదర్శనం అని చెప్పాలి.
ఇక రిలీజ్ రోజున సినిమా మార్నింగ్ అండ్ మ్యాట్నీ షోల సమయానికి అవలీలగా 85% టు 90% బుకింగ్స్ తో దూసుకుపోతుంది ఈ సినిమా. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర టికెట్ హైక్స్ అలాగే స్పెషల్ షోల అడ్వాంటేజ్ తో తొలిరోజు అల్లు అర్జున్ కెరీర్ బెస్ట్ ని తిరగరాసే అవకాశం ఉందని చెప్పొచ్చు.
ఇది వరకు చేసిన DJ సినిమా ఫస్ట్ డే 18.2 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకుంది, ఇప్పుడు థియేటర్స్ కౌంట్ అనుకున్న రేంజ్ లో దొరికితే ఆ మార్క్ ని అధిగమించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. ఇక టాక్ ని బట్టి సినిమా రేంజ్ ఎంతదూరం వెళుతుందో అన్నది చెప్పగలం, ఓవరాల్ గా అల్లుఅర్జున్ బాక్స్ ఆఫీస్ దగ్గర క్లాష్ లో కూడా కుమ్మేయడం ఖాయంగా కనిపిస్తుంది.