Home న్యూస్ డే(7) సరిలేరు నీకెవ్వరు, డే(6) అల వైకుంఠ పురంలో, డే(3) ఎంత మంచి వాడవురా కలెక్షన్స్!!

డే(7) సరిలేరు నీకెవ్వరు, డే(6) అల వైకుంఠ పురంలో, డే(3) ఎంత మంచి వాడవురా కలెక్షన్స్!!

0

   బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతి సినిమాల జోరు కంటిన్యు అవుతుంది, తెలుగు బిగ్గీస్ నువ్వా నేనా అన్న రేంజ్ లో కలెక్షన్స్ తో ఊచకోత కొస్తున్నాయి. మిగిలిన సినిమాలు కూడా ఎంతో కొంత కలెక్షన్స్ ని సాధిస్తున్నాయి. ఇక ఈ రోజు కలెక్షన్స్ విషయానికి వస్తే… ముందుగా దర్బార్ సినిమా ఈ రోజు కూడా రెండు తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల రేంజ్ లో షేర్ అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పాలి.

Sarileru Neekevvaru 7th Day Collections!!

ఇక మహేష్ సరిలేరు నీకెవ్వరు బాక్స్ ఆఫీస్ దగ్గర సాలిడ్ గా హోల్డ్ చేస్తూ దూసుకుపోతుండగా సినిమా 7 వ రోజు రెండు తెలుగు రాష్ట్రాలలో మరోసారి సాలిడ్ గా హోల్డ్ చేసింది, సినిమా ఈ రోజు మరోసారి 7 నుండి 8 కోట్ల రేంజ్ లో కలెక్షన్స్ ని అందుకోవచ్చు.

Ala Vaikunthapurramuloo 6th Day Collections!!

ఇక అల్లు అర్జున్ అల వైకుంఠ పురం లో బాక్స్ ఆఫీస్ దగ్గర 6 వ రోజు కూడా సాలిడ్ గా హోల్డ్ చేసింది, సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ రోజు మరోసారి దుమ్ము లేపడం ఖాయంగా కనిపిస్తుండగా మినిమమ్ 8 కోట్ల నుండి 9 కోట్లు అనుకునే అవకాశం ఎక్కువగా ఉందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.

ఇక కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా స్లో డౌన్ అవ్వగా మూడో రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా జస్ట్ ఒకే అనిపించే లెవల్ లో కలెక్షన్స్ ని సాధించే అవకాశం ఉంది, 60 లక్షల నుండి 70 లక్షల రేంజ్ లో షేర్ ని బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశం ఎక్కువగా ఉందని చెప్పొచ్చు.

మొత్తం మీద అన్ని సినిమాలు కలిపి ఓవరాల్ గా మంచి వసూళ్ళని సాధించబోతున్నాయి. సరిలేరు నీకెవ్వరు మరియు అల వైకుంఠ పురం లో మాత్రం ఊహకందని రేంజ్ లో హోల్డ్ చేస్తూ లాంగ్ రన్ ని కన్ఫాం చేసుకున్నాయి. ఇక అన్ని సినిమాల అఫీషియల్ కలెక్షన్స్ వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. రిపోర్ట్స్ వచ్చిన వెంటనే అప్ డేట్ చేస్తాం…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here