Home న్యూస్ స్పైడర్ మాన్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసిన డెడ్ పూల్ వుల్వరిన్!!

స్పైడర్ మాన్ వరల్డ్ రికార్డ్ ను బ్రేక్ చేసిన డెడ్ పూల్ వుల్వరిన్!!

0

వరల్డ్ వైడ్ గా భారీ క్రేజ్ నడుమ ఆడియన్స్ ముందుకు వస్తున్న హాలీవుడ్ బిగ్గీ డెడ్ పూల్ అండ్ వుల్వరిన్(Deadpool & Wovlerine Trailer World Record Views in 24 Hours) సినిమా రిలీజ్ కి ముందే సంచలనాలు సృష్టిస్తూ ఉండగా లేటెస్ట్ గా సినిమా రిలీజ్ కి ముందు ఫైనల్ ట్రైలర్ ను రిలీజ్ చేయగా ట్రైలర్ కి..

ఎక్స్ లెంట్ రెస్పాన్స్ సొంతం అయ్యింది. సినిమా మీద ఆడియన్స్ లో అంచనాలు కూడా ఓ రేంజ్ లో పెరిగి పోగా ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా అని అందరూ ఆశగా ఎదురు చూస్తూ ఉండగా ఫైనల్ ట్రైలర్ కి 24 గంటల్లో వచ్చిన రెస్పాన్స్ రికార్డులను అన్నీ బ్రేక్ చేసి సంచలనం సృష్టించింది…

కాగా ట్రైలర్ కి 24 గంటల్లో ఓవరాల్ గా అన్ని సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కలిపి ఏకంగా వరల్డ్ రికార్డ్ వ్యూస్ సొంతం అయ్యాయి అని అంటున్నారు…. ఇది వరకు మోస్ట్ హైప్ తో వచ్చిన స్పైడర్ మాన్ నో వె హోమ్(Spider-Man: No Way Home) ట్రైలర్ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

వరల్డ్ వైడ్ గా 355 మిలియన్ వ్యూస్ సొంతం అయ్యి అప్పట్లో వరల్డ్ రికార్డ్ ను నమోదు చేసి గిన్నీస్ బుక్ లో కూడా చోటుని సొంతం చేసుకుందట. ఇప్పుడు ఆ రికార్డ్ ను డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ మూవీ ఫైనల్ ట్రైలర్ 24 గంటలు పూర్తి అయ్యే టైంకి…

ఏకంగా 365 మిలియన్ వ్యూస్ ని ఓవరాల్ గా సొంతం చేసుకుని సరికొత్త గిన్నీస్ వరల్డ్ రికార్డ్ ను సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది ఇప్పుడు. ఈ రేంజ్ లో వరల్డ్ రికార్డ్ ను నమోదు చేసిన టాప్ ట్రైలర్స్ ను గమనిస్తే…

Deadpool And Wolverine: 365M views
Spider-Man: No Way Home: 355M
Avengers: Endgame: 289M
Avengers: Endgame trailer: 268M
The Lord of the Rings: The Rings of Power (Amazon series): 257M
ఇక ఇప్పుడు డెడ్ పూల్ అండ్ వుల్వరిన్ నెలకొల్పిన రికార్డ్ ను ఏ సినిమా ఫ్యూచర్ లో బ్రేక్ చేస్తుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here