Home న్యూస్ దేవదాస్@180 ప్లస్….ఈ రేంజ్ ఎవ్వరూ ఊహించలేదు!

దేవదాస్@180 ప్లస్….ఈ రేంజ్ ఎవ్వరూ ఊహించలేదు!

0

కింగ్ నాగార్జున మరియు నాచురల్ స్టార్ నాని ల కాంబినేషన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ దేవదాస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మరి కొన్ని గంటల్లో రిలీజ్ కి సిద్ధం అవుతుంది. వీరి కలయికలో వస్తున్న మల్టీ స్టారర్ అవ్వడంతో సినిమా పై అంచనాలు భారీ గానే ఉన్నాయి.

ఇక ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ అండ్ ట్రైలర్ ఇలా అన్ని పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడం సినిమా సెన్సార్ టాక్ కూడా పాజిటివ్ గా ఉండటంతో సినిమా ను అన్ని ఏరియాలలో అత్యంత భారీ ఎత్తున రిలీజ్ చేయడానికి సన్నాహాలు మొదలు పెట్టారు.

ముందుగా ఓవర్సీస్ లో సినిమా ఇటు నాగార్జున కెరీర్ లో అటు నాని కెరీర్ లో కూడా ఆల్ టైం రికార్డ్ లెవల్ లో ఏకంగా 180 కి పైగా లోకేషన్స్ లో రిలీజ్ కాబోతుంది. దాంతో ఓవర్సీస్ ప్రీమియర్ షోల కి కలెక్షన్స్ ఓ రేంజ్ లో వచ్చే అవకాశం పుష్కలంగా ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here