Home న్యూస్ నెల్లూరు గడ్డపై మచ్చలపులి భీభత్సం…కెరీర్ బెస్ట్ రికార్డ్

నెల్లూరు గడ్డపై మచ్చలపులి భీభత్సం…కెరీర్ బెస్ట్ రికార్డ్

0

2018 సెకెండ్ ఆఫ్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మోస్ట్ వాంటెడ్ మూవీ అరవింద సమేత పై అంచనాలు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫాం లో లేకున్నా ఎన్టీఆర్ త్రివిక్రమ్ ల కాంబో లో వస్తున్న మొదటి సినిమా అవ్వడంతో అంచనాలు పీక్స్ లో ఉన్నాయి.

ఇక సినిమా బిజినెస్ పరంగా ను అన్ని ఏరియాలలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కెరీర్ లో బిగ్గెస్ట్ రేట్లను దక్కించుకుంటూ దూసుకుపోతుంది. రెండు రాష్ట్రాలలో బిజినెస్ పరంగా చిన్న ఏరియా అయిన నెల్లూరు లో కూడా ఎన్టీఆర్ కెరీర్ బెస్ట్ బిజినెస్ ని సొంతం చేసుకుంది ఈ సినిమా.

ఇది వరకు అక్కడ ఎన్టీఆర్ కెరీర్ లో హైయెస్ట్ బిజినెస్ ని జైలవకుశ 2.8 కోట్లతో దక్కించుకోగా ఇప్పుడు అరవింద సమేత ఏకంగా 3.35 కోట్ల బిజినెస్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించింది. మరి బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఇప్పుడు ఎలాంటి భీభత్సం సృష్టిస్తుంది అనేది మాత్రం అక్టోబర్ 11 న తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here