బాక్స్ ఆఫీస్ దగ్గర దుమ్ము లేపే రేంజ్ లో కలెక్షన్స్ తో దూసుకు పోతున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్(Jr NTR) నటించిన లేటెస్ట్ మూవీ దేవర(Devara Part 1) హిందీలో మొదటి రోజు ఓపెనింగ్స్ వీక్ గా స్టార్ట్ అయినా కూడా ఈవినింగ్ షోల నుండి మొదలైన రచ్చ వీకెండ్ లో సాలిడ్ గా దుమ్ము లేపిన దేవర మూవీ ఎక్స్ లెంట్ గా జోరు చూపిస్తూ…
ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర బాలీవుడ్ లో సినిమా 50 కోట్ల నెట్ కలెక్షన్స్ ని అందుకుని మాస్ రచ్చ చేసింది దేవర సినిమా… వర్కింగ్ డేస్ లో స్లో అవుతున్న టైంలో 6వ రోజున నేషనల్ హాలిడే అడ్వాంటేజ్ తో దుమ్ము లేపిన దేవర మూవీ…
తర్వాత మళ్ళీ స్లో అవ్వగా మొదటి వారంలో 48 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకున్న సినిమా 8వ రోజు సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని దాటేసి దుమ్ము లేపగా వీకెండ్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర మళ్ళీ జోరు పెంచే అవకాశం ఎంతైనా ఉంది..
మొత్తం మీద సినిమా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా వాల్యూ బిజినెస్ 20 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమా 8 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో 26 కోట్లకు పైగా షేర్ మార్క్ ని దాటేసి సూపర్ హిట్ దిశగా దూసుకు పోతూ ఉంది. ఇక సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర రెండో వీకెండ్ లో…
హిందీలో ఎలాంటి పోటి లేక పోవడంతో వీకెండ్ లో మళ్ళీ జోరు చూపించే అవకాశం ఎంతైనా ఉన్న నేపధ్యంలో లాంగ్ రన్ లో ఇప్పుడు బాక్స్ ఆఫీస్ దగ్గర 75 కోట్ల మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉంది. ఇక లాంగ్ రన్ లో హిందీలో సినిమా ఎలాంటి జోరు చూపిస్తుందో చూడాలి.