టాలీవుడ్ మాన్ ఆఫ్ మాసెస్ అయిన ఎన్టీఆర్(Jr NTR) నటించిన రీసెంట్ మూవీ దేవర(Devara) ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో సోలో హీరోగా ఎన్టీఆర్ కెరీర్ లో సెన్సేషనల్ కలెక్షన్స్ తో మాస్ ఊచకోత కోసిన విషయం తెలిసిందే. తొలిరోజు ఎక్స్ ట్రీమ్ నెగటివ్ టాక్ తో ఓపెన్ అయిన సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర లాంగ్ రన్ లో…
ఊహకందని కలెక్షన్స్ తో ఊచకోత కోసి సంచలనం సృష్టించింది….450 కోట్ల రేంజ్ లో గ్రాస్ మార్క్ ని సొంతం చేసుకుని సంచలనం సృష్టించిన ఈ సినిమా తర్వాత డిజిటల్ లో కుమ్మేయగా…సోషల్ మీడియాలో ఇప్పటికీ సాంగ్స్…ఎలివేషన్స్ తో ట్రెండ్ అవుతూనే ఉండటం విశేషం…
ఇక సినిమా ఇప్పుడు ఈ మార్చ్ 28న జపాన్ లో గ్రాండ్ గా రిలీజ్ కి సిద్ధం అవుతూ ఉండగా అడ్వాన్స్ బుకింగ్స్ మంచి ట్రెండ్ ను చూపెడుతూ ఉండటం తో అక్కడ మంచి ఓపెనింగ్స్ ను అందుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. స్వయంగా ఎన్టీఆర్ అక్కడికి వెళ్లి..
సినిమాను ప్రమోట్ చేస్తూ ఉండటం తో ఓపెనింగ్స్ పై కచ్చితంగా ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉంది. అక్కడ ఎన్టీఆర్ కి మంచి మార్కెట్ కూడా ఉండటంతో ఓపెనింగ్స్ ఎలా ఉంటాయో చూడాలి. ఒకసారి అక్కడ తెలుగు మూవీస్ పరంగా సాలిడ్ ఓపెనింగ్స్ ను అందుకున్న మూవీస్ ని గమనిస్తే…
Tollywood Top Top opening day grossers in Japan
👉#RRRMovie- ¥9.14M
👉#Kalki2898AD – ¥8.5M
👉#Salaar – ¥5.50M
👉#Saaho – ¥4.60M
👉#Baahubali-2 – ¥3.2M
👉#Rangasthalam – ¥2.5M
రీసెంట్ గా అక్కడ రిలీజ్ అయిన కల్కి, సలార్ లాంటి సినిమాలు ఓపెనింగ్స్ బాగున్నా అనుకున్న రేంజ్ లో లాంగ్ రన్ రాలేదు. ఇప్పుడు మంచి ప్రమోషన్స్ తో రిలీజ్ అవుతున్న దేవర మూవీ ఓపెనింగ్స్ అండ్ లాంగ్ రన్ లో ఎలాంటి కలెక్షన్స్ ని అక్కడ సొంతం చేసుకుంటుందో చూడాలి.