అఖిల్ అక్కినేని నటించిన లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ బాక్స్ ఆఫీస్ దగ్గర అఖిల్ కెరీర్ లో మొట్ట మొదటి క్లీన్ హిట్ మూవీ గా నిలవగా సినిమా దసరా బరిలో నిలిచి పోటి ని తట్టుకుని మంచి వసూళ్ళని సొంతం చేసుకుని లాంగ్ రన్ లో మంచి లాభాలాను కూడా సొంతం చేసుకుని సత్తా చాటుకుంది. సినిమా బాక్స్ ఆఫీస్ రన్ ఆల్ మోస్ట్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు…
డిజిటల్ లో రిలీజ్ అవ్వడానికి సిద్ధం అవుతూ ఉంది, సినిమా డిజిటల్ రైట్స్ హక్కులను ఆహా వీడియో వాళ్ళు 4 కోట్ల రేంజ్ రేటు చెల్లించి సొంతం చేసుకోగా ఇప్పుడు ఓవర్సీస్ ఆడియన్స్ కోసం నెట్ ఫ్లిక్స్ కూడా ఈ సినిమా రైట్స్ ను 2 కోట్ల రేటు తో కొందని అంటున్నారు.
దాంతో రెండు చోట్లా ఇప్పుడు సినిమా ఈ నెల 19 న డిజిటల్ రిలీజ్ కాబోతుందని సమాచారం. బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమా అఖిల్ కెరీర్ కి బిగ్ బూస్టప్ ఇచ్చింది. ఇక డిజిటల్ లో సినిమా ఎలాంటి వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…