Home న్యూస్ దిల్ రూబ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

దిల్ రూబ మూవీ రివ్యూ….ప్లస్ అండ్ మైనస్ పాయింట్స్!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ క మూవీ తో మంచి హిట్ ను సొంతం చేసుకుని కుమ్మేసిన యంగ్ హీరో కిరణ్ అబ్బవరం(Kiran Abbavaram) నటించిన లేటెస్ట్ మూవీ అయిన దిల్ రూబ(Dilruba Movie) సినిమా ఆడియన్స్ ముందుకు హోళీ పండగ వీకెండ్ లో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకుంది. సినిమా సాంగ్స్ బాగానే క్లిక్ అవ్వడం…

సినిమా ట్రైలర్ యూత్ లో కొంత బజ్ ను క్రియేట్ చేయగా…మేకర్స్ సినిమాను బాగానే ప్రమోట్ చేశారు. మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆకట్టుకుంది లాంటి విశేషాలను తెలుసుకుందాం పదండీ… ముందుగా స్టోరీ పాయింట్ విషయానికి వస్తే…. లవ్ ఫెయిల్యూర్ అయిన హీరో…

తర్వాత లవ్ కి దూరంగా ఉంటాడు…కానీ అనుకోకుండా తన లైఫ్ లోకి హీరోయిన్ ఎంటర్ అవుతుంది….మళ్ళీ లవ్ లో పడతాడు…కానీ కొన్ని కారణాల వల్ల వీళ్ళ లైఫ్ లో కూడా ఆటంకాలు వచ్చిన టైంలో వీళ్ళని కలపడానికి హీరో ఫస్ట్ లవర్ వస్తుంది…ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా మిగిలిన కథ…

సినిమా కథ ఓవరాల్ గా రొటీన్ గానే అనిపించినా కూడా స్టోరీ పాయింట్ లో 2 పాయింట్స్ యూనిక్ గా అనిపిస్తాయి…ఒకటి హీరో ఎక్స్ లవర్ వచ్చి ప్రజెంట్ లవర్ తో హీరోని కలపాలి అనుకోవడం అయితే మరొకటి హీరో ఎవ్వరికీ సారీ థాంక్స్ చెప్పడు…దానికి ఒక రీజన్ ఉంటుంది…వీటి చుట్టూ అల్లుకున్న…

దిల్ రూబ కథ స్క్రీన్ ప్లే పరంగా రొటీన్ గా సాగడం వలన అనుకున్న రేంజ్ లో రూపొందలేక పోయింది. హీరో కిరణ్ అబ్బవరం మరోసారి తన మార్క్ నటనతో మెప్పించగా యాక్షన్ సీన్స్ లో కుమ్మేశాడు…సెంటిమెంట్ సీన్స్ లో పర్వాలేదు అనిపించగా హీరోయిన్ రుక్సాన్ పర్వాలేదు అనిపించింది.

మిగిలిన యాక్టర్స్ ఎవరి పరిదిలో వారు నటించి మెప్పించగా…సాంగ్స్ అండ్ బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్లస్ అయ్యాయి….ఎడిటింగ్ అండ్ స్క్రీన్ ప్లే ఫస్టాఫ్ లో యావరేజ్ గా సెకెండ్ ఆఫ్ లో బిలో యావరేజ్ గా అనిపించింది…సినిమాటోగ్రఫీ మెప్పించగా…ప్రొడక్షన్ వాల్యూస్ కూడా బాగున్నాయి.

డైరక్టర్ ఎంచుకున్న పాయింట్ బాగున్నా దాన్ని తాను అనుకున్న విధంగా ప్రజెంట్ చేయలేక పోయాడు. ఎలాగోలా ఫస్టాఫ్ పడుతూ లేస్తూ పర్వాలేదు అనిపించినా సెకెండ్ ఆఫ్ లో కథ ఎటు నుండి ఎటో వెళ్లి విలన్ త్రెడ్ చాలా సిల్లీగా అనిపిస్తూ సాగి ఎండ్ కి వచ్చే సరికి ఓకే అనిపించేలా ఉంటుంది… 

డైరెక్టర్ ముందు అనుకున్న మేజర్ పాయింట్స్ మీద మరింతగా వర్క్ చేసి ఉంటే బాగుండేది అనిపించింది. ఓవరాల్ గా రీసెంట్ కిరణ్ అబ్బవరం మూవీస్ లో వచ్చిన ఫ్లాఫ్ మూవీస్ మీద బెటర్ కంటెంట్ తో వచ్చిన మూవీ అని చెప్పాలి. 

కానీ వినరో భాగ్యము విష్ణుకథ, క లాంటి మూవీస్ తో పోల్చితే మట్టుకు పెద్దగా ఇంపాక్ట్ ను ఇవ్వలేక పోయింది. అలా అనీ మరీ బోర్ ఏమి అనిపించదు కానీ రొటీన్ గా సాగుతుంది. పెద్దగా అంచనాలు లాంటివి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే కొంచం పడుతూ లేస్తూ సాగినా ఒకసారి చూడొచ్చు లే అనిపించేలా ఉంటుంది… సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.5 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here