పోస్టర్స్ పబ్లిసిటీ… టాలీవుడ్ లో ఎప్పటి నుండో ఈ పబ్లిసిటీ కామన్… సినిమాల పోస్టర్ ల మీద హిట్స్, సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్ లు, ఇండస్ట్రీ హిట్స్, నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ ఇలా రక రకాల పోస్టర్స్ అప్పుడప్పుడు క్రేజ్ ఉన్న సినిమాల రిలీజ్ టైం లో చూస్తూనే ఉన్నాం… ఇక తర్వాత సినిమాల కలెక్షన్స్ నంబర్స్ ట్రెండ్ ఎప్పటి నుండో ఉంది కానీ ఇప్పుడు ఆ కలెక్షన్స్ పోస్టర్స్ లో…
నిజా నిజాలు చాలా మందికి తెలిసి పోయాయి. ఇక ఇప్పుడు రీసెంట్ గా విన్నర్ పోస్టర్స్ ట్రెండ్ మొదలు అయింది, పండగ టైం లో రిలీజ్ అయ్యే సినిమాలలో పోటి లో గెలిచిన సినిమాలను ఆడియన్స్ విన్నర్ చేయాల్సింది, మేకర్స్ తమకు తామే తమ సినిమా…
విన్నర్ అంటే తమ సినిమా విన్నర్ అంటూ పోస్టర్స్ ని ఆడియన్స్ ముందుకు వదులుతున్నారు. లేటెస్ట్ గా దీపావళి పోటి లో రెండు డబ్ మూవీస్ మధ్య పోటి లో రిలీజ్ అయిన మంచి రోజులు వచ్చాయి సినిమా పర్వాలేదు అనిపించే టాక్ ని సొంతం చేసుకున్నా కానీ కలెక్షన్స్ పరంగా…
సినిమా భారీ డిసాస్టర్ అనిపించే రేంజ్ లో వసూళ్ళని సొంతం చేసుకుంది, పోటి లో ఉన్న ఇతర సినిమాలు కూడా అంచనాలను అందుకోలేక చేతులు ఎత్తేయగా ఈ దీపావళి టాలీవుడ్ లో డిసాస్టర్ అనిపించుకుంది, కానీ ఈ సినిమా రిలీజ్ రోజునే కనీసం మార్నింగ్ షోలు కూడా కంప్లీట్ అవ్వక ముందే హిట్టు, సూపర్ హిట్టు లాంటి పోస్టర్స్ కాకుండా ఏకంగా దీపావళి విన్నర్ అంటూ…
పోస్టర్స్ ని వదిలారు మేకర్స్… ఒక పక్క పెద్దన్న ఎనిమీ షోలు కూడా కంప్లీట్ కాకముందే ఇలా ఓ సినిమా విన్నర్ అని ఎలా డిక్లేర్ చేస్తారు అంటూ ఆ పోస్టర్స్ పై సోషల్ మీడియాలో ట్రోల్స్ జరిగాయి, ఒక సినిమా హిట్ ఫ్లాఫ్ అనేది ఆడియన్స్ డిసైడ్ చేయాలి కానీ పోస్టర్స్ ని రిలీజ్ చేసుకుంటే ఏ సినిమా కూడా విన్నర్ అవ్వదు…. ఇలాంటి ట్రెండ్ టాలీవుడ్ లో ఇంకా ఎన్నాళ్ళు కొనసాగుతుందో ఏంటో…
Asla idanta ahh ala vaikuntapuram movie nunchi start ayindi.