విక్టరీ వెంకటేష్ హీరోగా మలయాళంలో ఈ ఇయర్ డిజిటల్ లో సూపర్ డూపర్ హిట్ అయిన సెన్సేషనల్ దృశ్యం2 సినిమా ను తెలుగు లో అదే పేరుతో రీమేక్ చేయగా ఆడియన్స్ ముందుకు ఈ సినిమా థియేటర్స్ లో కచ్చితంగా వస్తుంది అన్న హోప్స్ ని పెంచారు కానీ సినిమా మాత్రం థియేట్రికల్ రిలీజ్ ను కాన్సిల్ చేసుకుని ఆడియన్స్ ముందుకు డైరెక్ట్ గా డిజిటల్ రిలీజ్ ను రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో సొంతంచేసుకుంది.
సినిమాకు సరైన పబ్లిసిటీ కూడా చేయలేదు మేకర్స్… బాక్స్ ఆఫీస్ దగ్గర రిలీజ్ అయ్యి ఉంటే కచ్చితంగా అద్బుతాలు సృష్టించే అవకాశం ఉన్న ఈ సినిమాను ప్రస్తుతం ఇంకా ఆంధ్రలో సెట్ అవ్వని పరిస్థితులను పరిగణలోకి తీసుకుని డిజిటల్ లో రిలీజ్ చేశారు. కాగా రిలీజ్ అయిన తర్వాత సినిమా కి…
ఆడియన్స్ నుండి రెస్పాన్స్ మాత్రం ఓ రేంజ్ లో వస్తూ ఉండటం విశేషం అని చెప్పాలి. ఒరిజినల్ చూసిన వాళ్ళకి పర్వాలేదు బాగుంది అనిపించిన ఈ సినిమా చూడని వాళ్ళని మాత్రం ఓ రేంజ్ లో మెప్పిస్తుంది అని చెప్పాలి. ముఖ్యంగా సెకెండ్ ఇచ్చిన థ్రిల్ క్లైమాక్స్ ట్విస్ట్ లాంటివి సినిమా మేజర్ హైలెట్స్…
అవి హైలెట్ అవ్వడంతో మౌత్ టాక్ సాలిడ్ గా పాజిటివ్ గా సోషల్ మీడియా మొత్తం స్ప్రెడ్ అయ్యింది, దాంతో ఒరిజినల్ చూడని వాళ్ళు అందరూ కూడా ఇప్పుడు సినిమాను చూస్తున్నారు. కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే వెంకీ నటించిన నారప్ప సినిమా ఆల్ రెడీ ఈ ఇయర్ డిజిటల్ రిలీజ్ అవ్వగా ఆ సినిమాకి పబ్లిసిటీ చాలా బాగా చెయ్యడంతో డిజిటల్ రిలీజ్ టైం లో ఫుల్ హైప్ నెలకొంది..
సినిమాకి వ్యూవర్ షిప్ ఫస్ట్ డే నుండే రికార్డ్ లెవల్ లో సొంతం చేసుకుని టాలీవుడ్ లో డిజిటల్ రిలీజ్ వ్యూవర్ షిప్ లను అన్నీ బ్రేక్ చేసింది, కానీ దృశ్యం2 విషయంలో నారప్ప రేంజ్ బజ్ అయితే ఏమి లేదనే చెప్పాలి. దానికి తోడూ ఒరిజినల్ కూడా కొన్ని నెలల ముందే రావడంతో చాలా మంది ఆ సినిమాను చూడటం కూడా కొద్దిగా ఇంపాక్ట్ చూపి ఇప్పుడు వ్యూవర్ షిప్ ఎలా ఉంటుందో అన్న సందేహాలు కలగజేస్తుంది అని చెప్పాలి.