తమిళ్ తో పాటు తెలుగు లో కూడా మంచి పేరున్న హీరో విశాల్ అలాగే ఆర్యలు కలిసి వాడు వీడు సినిమా తర్వాత చేస్తున్న మరో మల్టీ స్టారర్ మూవీ ఎనిమీ, బాక్స్ ఆఫీస్ దగ్గర దీపావళి కానుకగా ఆడియన్స్ ముందుకు రావడానికి సిద్ధం అవుతున్న ఈ సినిమా విషయంలో ఇప్పుడు కోలివుడ్ లో రచ్చ జరుగుతున్నట్లు సమచారం. దానికి కారణం ఈ సినిమా రిలీజ్ ను సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న…
లేటెస్ట్ మూవీ పెద్దన్న సినిమా కి పోటిగా నవంబర్ 4 న రిలీజ్ చేయాలని ఫిక్స్ అవ్వగా రీసెంట్ గా సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేసి రిలీజ్ డేట్ ని మరోసారి ఎలాంటి మార్పు లేదని కన్ఫాం చేశారు. రిలీజ్ డేట్ కన్ఫాం చేయడం వరకు ఓకే కానీ సినిమా…
రిలీజ్ గ్రాండ్ గా అవ్వాలని నిర్మాతలు కోరుకుంటారు కదా… తమిళనాడు లో మొత్తం మీద ఉన్న థియేటర్స్ 750 నుండి 800 వరకు ఉండగా కరోనా వేవ్ ల వలన కొన్ని థియేటర్స్ మూతబడ్డాయి. ఇప్పుడు ఆల్ మోస్ట్ 80% స్క్రీన్స్ లో సూపర్ స్టార్ రజినీ సినిమా ను వేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తుండగా…
మల్టీ స్టారర్ మూవీ అయిన ఎనిమీ సినిమా కి థియేటర్స్ దొరకడం ఇప్పుడు కష్టం అయ్యింది అని అంటున్నారు. తమిళనాడు లో 220 నుండి 240 థియేటర్స్ కూడా ఈ సినిమా కి దొరకడం ఇప్పుడు కష్టమే అని అంటూ ఉండగా నిర్మాత థియేటర్స్ అగ్రిమెంట్స్ కోసం కష్టపడుతున్నట్లు చెబుతున్నారు. తక్కువలో తక్కువ… 250 థియేటర్లను కేటాయించాలంటూ ఈ చిత్ర నిర్మాత మాట్లాడినట్లుగా…..
చెబుతున్న ఆడియో ఒకటి బయటకు వచ్చింది.అందులో ఎంత నిజం ఉందో తెలియదు రజినీ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ, పండగ సీజన్, ఎన్ని కుదిరితే అన్ని థియేటర్స్ లో రిలీజ్ కి ఏ నిర్మాత అయినా ట్రై చేస్తారు, మరి పోటి కి సిద్ధం అయిన ఎనిమీ సినిమా పరిస్థితి ఏమవుతుంది, ఎంతవరకు థియేటర్స్ ని రిలీజ్ టైం కి సొంతం చేసుకుంటుందో త్వరలో తేలనుంది.