Home న్యూస్ ఎవరు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

ఎవరు ప్రీమియర్ షో రివ్యూ…హిట్టా-ఫట్టా!!

728
0

     తనకంటూ డిఫెరెంట్ కాన్సెప్ట్ మూవీస్ తో సినిమా సినిమా కి తన రేంజ్ ని పెంచుకుంటున్న యంగ్ హీరో అడవి శేష్ నటించిన కొత్త సినిమా ఎవరు మంచి బజ్ నడుమ నేడు ప్రేక్షకుల్ ముందుకు వచ్చేసింది, సినిమా ముందుగా ఓవర్సీస్ లో ప్రీమియర్ షోల ను పూర్తీ చేసుకోగా అక్కడ నుండి సినిమా కి ఎలాంటి లభిస్తుందో తెలుసుకుందాం పదండీ.. ముందుగా కథ పాయింట్ విషయానికి వస్తే… హీరోయిన్ రెజీనా రేప్ కి గురి అవుతుంది.

ఆ రేప్ చేసిన వ్యక్తీ ని చంపేస్తుంది, కానీ ఆ కేస్ నుండి బయట పడేయడానికి ఒక పోలిస్ ఆఫీసర్ హెల్ప్ తీసుకుంటుంది, మరి ఆ పోలిస్ ఆఫీసర్ తనని కేస్ నుండి బయట పడేలా శేషాడా లేదా అన్నది స్టొరీ పాయింట్ అంటున్నారు. మెయిన్ స్టొరీ పాయింట్ ఇదే అయినా…

ఇందులో వచ్చే ట్విస్ట్ లు టర్న్ లకు ప్రేక్షకులు థియేటర్స్ లో ఓ రేంజ్ లో థ్రిల్ అవ్వడం ఖాయమని అంటున్నారు. హీరోయిన్ రెజీనా అద్బుతంగా నటించి మెప్పించగా చిన్న రోల్ చేసిన నవీన్ చంద్ర కూడా ఆకట్టుకున్నాడట, ఇక అడవి శేష్ మరో సారి తన నటనతో ఆకట్టుకుని మెప్పిస్తాడు అంటున్నారు.

ఓవరాల్ కథ మొదలు అవ్వడానికి కొంత సమయం తీసుకున్నా ప్రీ ఇంటర్వెల్ నుండి జెట్ స్పీడ్ తో హై టెన్షన్ స్క్రీన్ ప్లే తో తర్వాత ఏం జరుగుతుంది అన్న ఆసక్తితో చివరి వరకు స్క్రీన్ ప్లే ఓ రేంజ్ లో ఆకట్టుకుంటుంది అంటున్నారు. బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా మరో ప్లస్ పాయింట్ అని అంటున్నారు.

ఓవరాల్ గా సినిమాకి ఓవర్సీస్ ఆడియన్స్ హిట్ నుండి సూపర్ హిట్ రేంజ్ టాక్ చెబుతున్నారు అని చెప్పాలి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఇదే రేంజ్ టాక్ ని సినిమా సొంతం చేసుకుంటే అడవి శేష్ కి మరో బాక్స్ ఆఫీస్ హిట్ పక్కా అని చెప్పొచ్చు. చూద్దాం ఏం జరుగుతుందో…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here