Home న్యూస్ అమ్మింది 7 కోట్లకి…TRP రేటింగ్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

అమ్మింది 7 కోట్లకి…TRP రేటింగ్ తెలిస్తే మైండ్ బ్లాంక్!!

0

  విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ ఎఫ్ 2 ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్… సంక్రాంతి బరిలో పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయ్యి ఊహకందని లెవల్ లో 84.51 కోట్ల షేర్ ని అందుకుని బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా ఉగాది కానుకగా టెలివిజన్ లో టెలికాస్ట్ అయ్యి అక్కడ దుమ్ము లేపే TRP రేటింగ్ తో కుమ్మేసింది, సినిమా ఓవరాల్ గా మొదటి సారి టెలికాస్ట్ అయినప్పుడు….

ఏకంగా 17.2 TRP రేటింగ్ దక్కిందని సమాచారం, ఇది ఇటు వెంకీ కి అటు వరుణ్ తేజ్ కెరీర్ లో రెండో బిగ్గెస్ట్ TRP రేటింగ్ గా చెప్పుకోవాలి, వెంకీ నటించిన దృశ్యం కి 18 కి పైగా TRP రేటింగ్ రాగా వరుణ్ తేజ్ ఫిదా కి 20 కి పైగా TRP రేటింగ్ వచ్చిన విషయం తెలిసిందే.

ఇక సినిమా శాటిలైట్ రైట్స్ 7 కోట్లకు పైగా పలకగా సినిమా మొదటి టెలికాస్ట్ లోనే చాలా మొత్తాన్ని వెనక్కి తెచ్చినట్లు సమాచారం. ఇది నిజంగానే ఊచకోత అని చెప్పాలి, వెండితెరపై అలాగే బుల్లి తెరపై కూడా ఈ సినిమా అద్బుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here