Home న్యూస్ F2 మూవీ రివ్యూ రేటింగ్…హిట్టా ఫ్లాఫా!

F2 మూవీ రివ్యూ రేటింగ్…హిట్టా ఫ్లాఫా!

0

    విక్టరీ వెంకటేష్ అంటే ఒకప్పుడు కామెడీ మూవీస్ కి పెట్టింది పేరు, నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి సినిమాలకు ఇప్పటికీ ఆదరణ ఉంది, అలాంటి వెంకీ ని మళ్ళీ అలాంటి కామెడీ చేస్తూ చూడాలని చాలా రోజులుగా అందరు ఎదురు చూస్తుండగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో వచ్చిన F2 లో అది దాదాపు నిజం అయింది, సినిమా మొత్తం వన్ మ్యాన్ షో చేశాడు వెంకీ.. ఒకసారి సినిమా ఎలా ఉందొ తెలుసుకుందాం పదండీ..

  ఒక ప్రేమ జంట, ఒక పెళ్ళైన జంట… మొదట్లో బాగున్నా కొంత కాలం గడించిన తర్వాత రిలేషన్ షిప్ లో వచ్చే మార్పులు వీరిని వేరు చేస్తున్న తరుణంలో హీరోలు ఇద్దరు యూరప్ వెళ్ళిపోతారు. మరి హీరోయిన్స్ ఏం చేశారు, అందరు తిరిగి ఏకం అయ్యారా లేదా అన్నది అసలు కథ.

కథ పాయింట్ చాలా చిన్నదే అయినా దర్శకుడు అనిల్ రావిపూడి ఫస్టాఫ్ ని చెడుగుడు ఆడేసుకున్నాడు, వెంకీ లో ఉన్న కామెడి టైమింగ్ ని ఫుల్లు గా వాడుకుని కావలసినంత కామెడీ ని పిండుకున్నాడు. దాంతో ఇదో నువ్వు నాకు నచ్చావ్ మల్లీశ్వరి లాంటి సినిమా అవ్వడం గ్యారెంటీ అన్న ఫీలింగ్ తో…

మొదటి అర్ధభాగం గడవగా, సెకెండ్ ఆఫ్ కథ యూరప్ వెళ్ళడం తో ఏటో ఏటో వెళ్ళిపోతూ ఉండటంతో ఆశలు అందుకోలేక పోయినా కానీ పర్వలేదు బాగానే ఉంది లే అనిపించే విధంగా సినిమా ముగుస్తుంది. వెంకీ సినిమా కి వెన్నెముక. వరుణ్ తేజ్ కి తెలంగాణా యాస సెట్ కాలేదు అనిపిస్తుంది.

హీరోయిన్స్ గ్లామర్ తో ఆకట్టుకోగా పెర్ఫార్మెన్స్ కూడా బాగానే ఉంది, మిగిలిన పాత్రలు కూడా తమ పరిదిలో నటించి నవ్విస్తాయి. లాజిక్ లు వెతక్కుండా రెండున్నర గంటల్లో చాలా వరకు నవ్వుకునే సినిమా ఈ సినిమా. ప్లసులు మైనస్ లు పక్కకు పెడితే ఈ మధ్యకాలంలో…

ఎంతో కొంత ఎంజాయ్ చేసే విధంగా ఉన్న కామెడీ కూడా ఇందులో నే ఉందని చెప్పాలి. దేవి సంగీతం బ్యాగ్రౌండ్ స్కోర్ పర్వాలేదు అనిపిస్తుంది, ఎడిటింగ్ బాగానే ఉన్నా సెకెండ్ ఆఫ్ మరింత షార్ప్ గా ఉండాల్సింది, ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

ఇక అనిల్ రావిపూడి తన పంథాలో మంచి ఎంటర్ టైనర్ నే ఇచ్చినా ఇవి ఇదివరకు సినిమాలతో పోల్చితే కొంచం తక్కువే అని చెప్పాలి, కానీ రీసెంట్ టైం లో ఎంటర్ టైనర్స్ కరువు అవ్వడంతో ఫ్యామిలీ తో ఈజీగా ఒకసారి ఎంజాయ్ చేయోచ్చు.

సినిమా కి ఫైనల్ గా మేం ఇస్తున్న రేటింగ్ 2.75 స్టార్స్… వింటేజ్ వెంకీ కామెడీ, అల్టిమేట్ ఫస్టాఫ్, యావరేజ్ సెకెండ్ ఆఫ్ ఓవరాల్ ఈ సంక్రాంతి పక్కా ఫ్యామిలీ ఎంటర్ టైనర్ F2 ఇక బాక్స్ ఆఫీస్ జోరు ఎలా ఉంటుందో చూడాలి.. న్యూస్ అప్ డేట్స్ కోసం బెల్ ఐకాన్ ని ప్రెస్ చేసి సబ్ స్బైబ్ చేసుకోండి.. అప్ డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here