బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ స్టార్టింగ్ నుండి వరుస పెట్టి సినిమాలు రిలీజ్ అవ్వగా రెండు తెలుగు రాష్ట్రాలలో టికెట్ హైక్స్ కూడా భారీగా పెరిగి పోయాయి, ఆంధ్రలో లో టికెట్ రేట్స్ వలన ఇబ్బందులు ఎదురు అయినా తర్వాత పెరగడం కూడా కలక్షన్స్ పరంగా ఇబ్బందులు ఎదురు అవ్వడం కామన్ గా జరుగుతూ వచ్చింది. వీకెండ్స్ తప్పితే వర్కింగ్ డేస్ ఆక్యుపెన్సీలు చాలా వరకు తగ్గిపోవడం జరుగుతూ రాగా….
నిర్మాత దిల్ రాజు తన లేటెస్ట్ మూవీ ఎఫ్ 3 మూవీ కి నార్మల్ టికెట్ రేట్స్ తోనే ఆడియన్స్ ముందుకు రాబోతుంది అంటూ అఫీషియల్ గా చెప్పారు…. కానీ బుకింగ్స్ ఓపెన్ చేసి చూస్తె నైజాంలో 250, 295 అలాగే సింగిల్ స్క్రీన్స్ లో 175 టికెట్ రేట్స్ పెట్టారు….ఆంధ్రలో కూడా 150, 175, 200 కి పైగానే ఉన్నాయి.
కానీ ఇది వరకు సింగిల్ స్క్రీన్స్ లో 110 నుండి 150 వరకు ఉండగా మల్టిప్లెక్సులలో 150 నుండి 200 వరకు రేట్స్ ఉండేవి, కానీ ఇప్పుడు నార్మల్ రేట్స్ అంటున్న ఎఫ్ 3 కి కూడా 175, 250 ఉండటం ఏ లెక్కన నార్మల్ అనేది మేకర్స్ కే తెలియాలి. మరి రీసెంట్ బిగ్ మూవీస్ తో పోల్చితే ఇవి కొంచం తక్కువే అయినా ఇవి ఓవరాల్ గా నార్మల్ అయితే కావు అనే చెప్పాలి.