Home న్యూస్ 3 రోజుల్లో 519 కోట్లు….ఇక్కడ కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న F9!!

3 రోజుల్లో 519 కోట్లు….ఇక్కడ కూడా ప్రకంపనలు సృష్టిస్తున్న F9!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర లాస్ట్ ఇయర్ ఫస్ట్ వేవ్ తర్వాత కొన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకున్నాయి. ఇండియా లో కొన్ని సినిమాలు అదరగొట్టగా హాలీవుడ్ లో కూడా కొన్ని సినిమాలు సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని సత్తా చాటుకున్నాయి. టెనెట్, వండర్ వుమన్ 2, గాడ్జిల్లా Vs కాంగ్ లాంటి సినిమాలు బాగానే కలెక్షన్స్ ని సాధించినా అందరూ ఎదురు చూస్తున్న మరో సినిమా F9 ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్…

మాత్రం సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ వలన రిలీజ్ ను పోస్ట్ పోన్ చేసుకోవాల్సి రాగా ముందుగా చైనా తో పాటు కొన్ని ఇతర దేశాల్లో రిలీజ్ అయ్యి అక్కడ కుమ్మేసిన తర్వాత ఎట్టకేలకు హాలీవుడ్ లో ఈ సినిమా రీసెంట్ గా రిలీజ్ ను సొంతం చేసుకుంది.

పాండమిక్ తర్వాత అక్కడ బిగ్గెస్ట్ రిలీజ్ గా నిలిచిన ఈ సినిమా మొత్తం మీద మొదటి రోజు నుండే దుమ్ము లేపడం మొదలు పెట్టింది. ఫస్ట్ డే ఏకంగా 30 మిలియన్ డాలర్స్ ని సొంతం చేసుకున్న ఈ సినిమా తర్వాత వీకెండ్ మొత్తం మీద మరింత జోరు చూపి….

70 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంది. అంటే ఇండియన్ కరెన్సీ లో 519 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ ని సినిమా సొంతం చేసుకుంది అని చెప్పాలి. ఇక సినిమా ఈ కలెక్షన్స్ తో పాటు ఇతర దేశాల కలెక్షన్స్ తో కలిపి మొత్తం మీద ఇప్పటి వరకు ఆల్ మోస్ట్ 400 మిలియన్ డాలర్స్ కలెక్షన్స్ ని టచ్ చేసిందని సమాచారం. ఆల్ రెడీ బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ తో దూసుకు పోతున్న…

ఈ సినిమా ఇండియా లో ఈ పాటికే రిలీజ్ అవ్వాల్సింది కానీ సెకెండ్ వేవ్ ఎఫెక్ట్ తగ్గినా థియేటర్స్ ఇంకా రీ ఓపెన్ అవ్వని కారణం వలన మరింత లేట్ గా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది, ఈ సిరీస్ కి ఇండియా లో కూడా క్రేజ్ సాలిడ్ గా ఉంటుంది కాబట్టి ఎప్పుడు రిలీజ్ అయినా సాలిడ్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకునే అవకాశం ఎంతైనా ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here