ఇక్కడ ఏం సినిమా రా బాబు అన్నది నెగటివ్ గా కాదు… ఇలాంటి కాన్సెప్ట్ తో కూడా తెలుగు లో సినిమాలు వస్తాయా అన్న పాయింట్ ఆఫ్ ఫ్యూలో… కలర్ ఫోటో తో హీరోగా పరిచయం అయిన సుహాస్ ఆ సినిమాతోనే ఫుల్ మార్కులు కొట్టేయగా తర్వాత తనకి నప్పే స్టైల్ లో చేసిన కొత్త సినిమా ఫ్యామిలీ డ్రామా… పేరు ఏమో ఫ్యామిలీ ఫ్రెండ్లీలా పెట్టినా ఇది ఒక సైకోటిక్ ఫిల్మ్ అని చెప్పాలి….
ఒక్క ఫ్యామిలీ చుట్టూనే టోటల్ కథ తిరుగుతూ ఉంటుంది, తండ్రి కొడుకుల పై తన సైకోయిజాన్ని చూపిస్తూ సెటిల్ అవ్వడం లేదని తిడుతూ కొడుతూ ఇంట్లో నుండి ఒక కొడుకుని వెళ్ళగొట్టి కొత్తగా పెళ్లి అయ్యి సెట్ అవ్వని చిన్న కొడుకుని కూడా వెల్లగొడతా అంటూ వార్నింగ్ ఇస్తూ…
తన భార్యని ఎప్పుడూ కొడుతూ చివాట్లు పెడుతూ ఉంటాడు… కట్ చేస్తే ఊర్లో కొన్ని హత్యలు జరుగుతాయి.. బ్లేడ్ తో గొంతు కోసి కొందరినీ చంపేస్తూ ఉంటారు, ఆ సైకో ఎవరో పట్టుకోవడానికి ట్రై చేస్తూ ఉండగా ఆ ఇంటి పెద్ద కొడుకు అయిన సుహాస్ తండ్రిని పారలైజ్ చేసే ఓ మందుని తమ్ముడికి ఇస్తాడు….
తమ్ముడు అమ్మ కలిసి తండ్రిని పారలైజ్ చేయగా అప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాడు సుహాస్, ఆ ఇంట్లో తర్వాత అసలు కథ మొదలు అవుతుంది, ఆ ట్విస్ట్ లు టర్న్ లు అన్నీ కూడా సినిమా చూసి తెలుసుకోవాల్సిందే… ఊహించని విధంగా తర్వాత ఒక్కో సీన్ లో ఒక్కొక్కరి అసలు నిజస్వరూపం రివీల్ అవుతూ ఉండగా…
సినిమాలో ఇంటర్వెల్ ట్విస్ట్ సెకెండ్ ఆఫ్ పై ఆసక్తిని పెంచుతుంది, సెకెండ్ ఆఫ్ కథ కొంచం స్లో అయినా తర్వాత ప్రీ క్లైమాక్స్ నుండి తేరుకుని క్లైమాక్స్ మరో ఊహించని ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది, మొత్తం అయిపోయిన తర్వాత ఏం సినిమా రా బాబు అని ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఇష్టపడే వాళ్లకి అనిపించడం ఖాయం…
అలాగే ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ నచ్చని వాళ్లకి ఇదేం సినిమా రా బాబు అనిపించడం కూడా కామన్, మొత్తం మీద సుహాస్ తన యాక్టింగ్ తో మరోసారి అదరగొట్టేశాడు, సినిమాలో ఇతర క్యారెక్టర్స్ కూడా బాగా మెప్పించగా తల్లి పాత్ర ఇచ్చే ట్విస్ట్ అదిరిపోయింది… ఇక బ్యాగ్రౌండ్ స్కోర్ సినిమా కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్…
ఓవరాల్ గా ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ తెలుగు లో రావడం అరుదు అనే చెప్పాలి… కథ-కథనం కొంచం స్లోగా సాగినా 2 గంటలకి పైగా లెంత్ ఉన్న మూవీ చాలా వరకు ఇంప్రెస్ చేసి మెప్పిస్తుంది… కొన్ని చోట్ల స్క్రీన్ ప్లే మరింత బాగా రాసుకుంటే ఇంకా బాగా థ్రిల్ చేసి ఉండేది సినిమా. సోనీ లివ్ యాప్ లో ఉన్న ఈ ఫ్యామిలీ డ్రామా ని టైం కుదిరితే తప్ప చూడండి..