Home న్యూస్ హృతిక్ రోషన్ “ఫైటర్” టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

హృతిక్ రోషన్ “ఫైటర్” టాక్ ఏంటి…సినిమా హిట్టా-ఫట్టా!!

0

బాలీవుడ్ టాప్ స్టార్స్ లో ఒకరైన హృతిక్ రోషన్(Hrithik Roshan) నటించిన లేటెస్ట్ మూవీ ఫైటర్(Fighter Movie Telugu Review) ఆడియన్స్ ముందుకు రిపబ్లిక్ డే కానుకగా గ్రాండ్ గా రిలీజ్ అయింది. సినిమా మీద ముందు భారీ అంచనాలు ఉన్నా కానీ ట్రైలర్ రిలీజ్ తర్వాత కొంచం అంచనాలు తగ్గాయి. ఇక ఆడియన్స్ ముందుకు వచ్చిన తర్వాత సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుందో తెలుసుకుందాం పదండీ….

ఫైటర్ పైలట్ అయిన హీరో దూకుడు స్వభావం కలిగిన వ్యక్తి, పుల్వామా దాడుల తర్వాత పాకిస్థాన్ పై చేసిన దాడిలో ఇద్దరు అక్కడే చిక్కుకోవడంతో హీరో మీద కోపంతో వేరే చోటుకి తన ఉద్యోగం మార్చగా ఆ జాబ్ కి రాజీనామా చేసిన హీరో ని ఒక ఎమర్జెన్సీ కోసం తిరిగి తన హెల్ప్ కావాల్సి వస్తుంది, ఆ తర్వాత కథ ఏమయింది అన్నది సినిమా స్టొరీ పాయింట్…

బాలీవుడ్ లో రీసెంట్ టైంలో ఇండియా పాకిస్థాన్ నేపధ్యంలో ఇలాంటి కథలు మరీ రొటీన్ గా మారిపోయాయి. ఇందులో కూడా కథ రొటీన్ అయినా కూడా కాన్సెప్ట్ మాత్రం ఎయిర్ ఫైట్స్ చుట్టూ తిరగడం ఒక్కటే కొంచం డిఫెరెంట్ కాన్సెప్ట్ అయినా కూడా ఇలాంటి ఫైటర్ జెట్స్ తో కొత్త కాన్సెప్ట్ ఆకట్టుకోగా… కొన్ని సీన్స్ బాగా రావడం బాగుండగా…

హీరోయిన్ తో కొన్ని సీన్స్ ఎమోషనల్ గా మెప్పించడం, అలాగే రెండు మూడు చోట్ల ఎమోషన్స్ బాగుండటం ఆకట్టుకుంది, కానీ కథ మరీ రొటీన్ గా అవ్వడంతో చాలా వరకు సినిమా ఫ్లాట్ గా మారిపోయింది….ఇలాంటి కాన్సెప్ట్ మూవీస్ ఇక్కడ ఆడియన్స్ కి కొత్త అవ్వడంతో సినిమా కొన్ని సీన్స్ వరకు బాగున్నా కూడా….

ఓవరాల్ గా రొటీన్ గానే అనిపించడం, స్క్రీన్ ప్లే పెద్దగా ఎఫెక్టివ్ గా లేకపోవడం, లెంత్ ఎక్కువ అయినట్లు అనిపించడం మేజర్ డ్రా బ్యాక్స్  అని చెప్పొచ్చు, కానీ ఉన్నంతలో హృతిక్ రోషన్ మరోసారి తన స్క్రీన్ ప్రజెన్స్ అండ్ యాక్టింగ్ తో ఆకట్టుకోగా అనిల్ కపూర్ మరియు దీపిక పడుకునేలు కూడా మెప్పించారు, విలన్ వీక్ గా ఉండటం మరో మైనస్ పాయింట్…

మరీ ఓవర్ గా ఎక్స్ పెర్టేషన్స్ లాంటివి పెట్టుకోకుండా థియేటర్స్ కి వెళితే సినిమా పర్వాలేదు ఒకసారి చూడొచ్చు అనిపించేలా ఉంటుంది, భారీ అంచనాలతో వెళితే విజువల్స్ హాలీవుడ్ మూవీస్ కి తీసిపోని విధంగా అనిపించినా కూడా కథ, కథనాలు మాత్రం మన వాళ్ళకి మరీ అనుకున్న రేంజ్ లో ఎక్కే అవకాశం తక్కువే అని చెప్పాలి. సినిమా కి ఓవరాల్ గా మా రేటింగ్ 2.5 స్టార్స్.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here