కెరీర్ లో ఆల్ టైం బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ తో పాటు టాలీవుడ్ సరికొత్త నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ ని కూడా తన సొంతం చేసుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు కెరీర్ బెస్ట్ ఫామ్ ని అందుకుని దూసుకు పోతున్నాడు. మరో పక్క డైరెక్టర్ సుకుమార్ కూడా రంగస్థలం సినిమా తో ఇండస్ట్రీ హిట్ కొట్టగా ఇప్పుడు ఇద్దరు ఇండస్ట్రీ హిట్స్ కొట్టిన హీరో అండ్ డైరెక్టర్ ల కాంబినేషన్ లో…
తెరకెక్కుతున్న అప్ కమింగ్ మూవీ పుష్ప పాన్ ఇండియా లెవల్ లో రూపొందుతున్న విషయం అందరికీ తెలిసిందే. అల్లు అర్జున్ బర్త్ డే రోజున అఫీషియల్ ఫస్ట్ లుక్ అనౌన్స్ మెంట్ జరిగిన ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కి కరోనా వలన బ్రేక్ పడగా…
ఇప్పటికీ ఆ ప్రభావం తగ్గకున్నా కానీ చాలా డిలే అవుతుంది అన్న కారణంగా ఇప్పుడు త్వరలోనే సినిమా షూటింగ్ తిరిగి మొదలు పెట్టాలని యూనిట్ భావిస్తుండగా సినిమా బడ్జెట్ విషయం లో మరింత కేర్ తీసుకోవాలని అల్లు అర్జున్ నిర్మాతలను అలాగే డైరెక్టర్ సుకుమార్ ని కోరాడని లేటెస్ట్ టాలీవుడ్ టాక్.
సినిమా ను అనౌన్స్ చేసిన టైం లో సుమారు 100 కోట్ల రేంజ్ బడ్జెట్ తో రూపొందిస్తారు అన్న టాక్ వినిపించగా ఇప్పుడు చాలా వరకు ఇండోర్ సెట్స్ లో సినిమా షూటింగ్ జరిగే అవకాశం ఎక్కువగా ఉండటం బడ్జెట్ తగ్గించి సినిమాను 80 కోట్ల రేంజ్ లో రూపొందిస్తే బాగుంటుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడట….
ఒక వేల మరీ అవసరం అయితే తప్పితే సినిమా ను 80 లోపే కంప్లీట్ చేయాలని చెప్పారట… అల వైకుంఠ పురం లో సినిమా కూడా ఆల్ మోస్ట్ ఇదే రేంజ్ బడ్జెట్ తో రూపొందగా బాక్స్ ఆఫీస్ రికార్డుల బెండు తీసింది, ఇప్పుడు పుష్ప కి కూడా అదే రేంజ్ బడ్జెట్ సేఫ్ గేమ్ అవుతుందని అల్లు అర్జున్ భావిస్తున్నాడని అంటున్నారు. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ డీటైల్స్ రివీల్ అవ్వాల్సి ఉంది…