జబర్దస్త్ షోతో బాగా పాపులర్ అయిన సుడిగాలి సుధీర్ ఆ ఫేమ్ తో అడపాదడపా సినిమాల్లో కనిపించగా అప్పుడప్పుడు హీరోగా కూడా ట్రై చేశాడు, ఈ క్రమం లో కొంత టైం క్రితం చేసిన సాఫ్ట్ వేర్ సుధీర్ పర్వాలేదు అనిపించగా ఇప్పుడు ఆడియన్స్ ముందుకు గాలోడు అంటూ మాస్ కమర్షియల్ మూవీ తో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి వచ్చాడు, మరి సినిమా ఎలా ఉంది ఎంతవరకు ఆడియన్స్ ను అలరించగలిగింది లాంటి విశేషలాను తెలుసుకుందాం పదండీ…. ముందుగా సినిమా స్టొరీ పాయింట్ విషయానికి వస్తే….
ఊర్లో అల్లరి చిల్లరగా తిరిగే హీరో ఒక ఇంసిడెంట్ లో హత్య కేసులో ఇరుక్కుంటాడు, ఊరి నుండి పారిపోయి సిటీకి వచ్చిన హీరో ఇక్కడ హీరోయిన్ ని కొందరు ఇబ్బంది పెడుతున్న టైంలో కాపాడతాడు, దాంతో హీరోయిన్ తన ఫాదర్ కి చెప్పి హీరోకి జాబ్ ఇప్పిస్తుంది, తర్వాత ఇద్దరూ లవ్ చేసుకుంటూ ఉండగా పోలీసులు హీరోని పట్టుకుంటారు, తర్వాత ఏం జరిగింది అన్నది అసలు కథ….
హీరోగా సుడిగాలి సుధీర్ పర్వాలేదు, మాస్ లుక్ బాగుంది యాక్షన్ కూడా బాగా చేశాడు కానీ అది మరీ ఓవర్ డోస్ అయింది. హీరోయిన్ పర్వాలేదు అనిపించగా సప్తగిరి కూడా ఆకట్టుకున్నాడు. సినిమా కథలో ఏమాత్రం కొత్తదనం లేదు, రొటీన్ రొట్ట అనిపించే స్టొరీ లైన్ తో తెరకెక్కిన ఈ సినిమా…
సినిమాటోగ్రఫీ పర్వాలేదు అనిపించడం, మరీ ఓవర్ అయినా కొన్ని యాక్షన్ బ్లాక్స్ బాగుండటం తప్ప సినిమాలో చెప్పుకోవడానికి ఇంకా ఏమి లేదనే చెప్పాలి. పరమ రొటీన్ స్టొరీ అండ్ స్క్రీన్ ప్లే, వీక్ కామెడీ టూ మచ్ బిల్డప్ షాట్స్ తో నిండిపోయిన సినిమా 2 గంటలే ఉన్నా కానీ సినిమా చాలా లెంత్ ఉన్నట్లు బోర్ ఫీల్ అయ్యేలా చేస్తుంది.
రొటీన్ మాస్ మూవీస్ ఇష్టపడే ఆడియన్స్ కి కూడా జస్ట్ ఓకే అనిపించే ఈ సినిమా కొత్తదనం కోరుకునే ఆడియన్స్ కి చాలా కష్టం అనే చెప్పాలి. మొత్తం మీద సుధీర్ ఫ్యాన్స్ కి కొద్దిగా నచ్చే అవకాశం ఉండగా మిగిలిన ఆడియన్స్ కి సినిమా చాలా బోర్ అండ్ రొటీన్ గా అనిపిస్తుంది… మొత్తం మీద సినిమా కి మా రేటింగ్ 2.25 స్టార్స్….