Home న్యూస్ 2 వీక్స్ లో రిలీజ్….గేమ్ చేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి!!

2 వీక్స్ లో రిలీజ్….గేమ్ చేంజర్ ఓవర్సీస్ బుకింగ్స్ ఇలా ఉన్నాయేంటి!!

1

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా భారీ బడ్జెట్ తో భారీ అంచనాల నడుమ రూపొందుతూ ఉండగా సినిమా సంక్రాంతికి భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతున్న ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ ఓవర్సీస్ లో ఓపెన్ అయ్యి…

ఆల్ రెడీ పది రోజులకు పైగా టైం అవుతుంది…సినిమాకి పెట్టిన బడ్జెట్, కాంబినేషన్ క్రేజ్ ఇలా అన్నీ చూసుకుంటే కచ్చితంగా మాస్ బుకింగ్స్ ను సినిమా సొంతం చేసుకోవాల్సింది…కానీ ఇప్పటి వరకు జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ చూస్తుంటే మాత్రం బుకింగ్స్ ట్రెండ్…

చాలా వీక్ గా అనిపిస్తుంది ఇప్పుడు…సినిమా రిలీజ్ కి ఇంకా 2 వారాల టైం ఉండగా టోటల్ గా నార్త్ అమెరికాలో సినిమా ప్రీ బుకింగ్స్ ఓవరాల్ గా 10 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ ను సొంతం చేసుకుంది…375 లోకేషన్స్ లో ఓవరాల్ గా $290K డాలర్స్ మార్క్ ని మాత్రమే అందుకుంది…

అదే టైంలో 2 వారాల ముందు రీసెంట్ బిగ్ పాన్ ఇండియా మూవీస్ బుకింగ్స్ ను చూస్తె…కల్కి మూవీ 480 కి పైగా లోకేషన్స్ లో 35 వేల రేంజ్ లో టికెట్ సేల్స్ లో 1 మిలియన్ కి పైగా డాలర్స్ ను అందుకోగా తర్వాత వచ్చిన దేవర మూవీ 2 వారాల ముందు చూసుకుంటే…

450 కి పైగా లోకేషన్స్ లో 40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో 1.18 మిలియన్ డాలర్స్ ని అందుకుంది…ఇక లేటెస్ట్ పుష్ప2 మూవీ 2 వారాల ముందు 880 కి పైగా లోకేషన్స్ లో 40 వేలకు పైగా టికెట్ సేల్స్ తో 1 మిలియన్ కి పైగా డాలర్స్ ను సొంతం చేసుకుంది…

వీటితో పోల్చితే గేమ్ చేంజర్ సినిమా బుకింగ్స్ ట్రెండ్ చాలా వీక్ గానే ఉంది…కానీ మెయిన్ సెంటర్స్ లో బెస్ట్ స్క్రీన్స్ లో బుకింగ్స్ ఇంకా ఓపెన్ చేయాల్సి ఉందని చెబుతూ ఉన్నప్పటికీ…ప్రజెంట్ ట్రెండ్ మాత్రం ఇతర బిగ్ మూవీస్ తో పోల్చితే…

చాలా వీక్ గానే ఉండగా ఇప్పుడు సినిమా బుకింగ్స్ జోరు అందుకోవాలి అంటే మాత్రం సినిమా ట్రైలర్ రిలీజ్ అయ్యి అంచనాలను మించే రేంజ్ లో ఉంటేనే బుకింగ్స్ లో జోరు కనిపించే అవకాశం ఉంటుంది… మరి సినిమా రిలీజ్ టైంకి పరిస్థితులు సెట్ అయ్యి దుమ్ము లేపుతుందో లేదో చూడాలి ఇప్పుడు.

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here