Home న్యూస్ రాయలసీమ లో గేమ్ చేంజర్ బిజినెస్….టాక్ వస్తే ఇక మాస్ రచ్చే!!

రాయలసీమ లో గేమ్ చేంజర్ బిజినెస్….టాక్ వస్తే ఇక మాస్ రచ్చే!!

0

ట్రైలర్ రిలీజ్ కి ముందు వరకు ఎలా ఉన్నా కూడా ఇప్పుడు ట్రైలర్ రిఇజ్ తర్వాత ఒక్కసారిగా గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మీద బజ్ అమాంతం పెరిగిపోయింది….ఇన్ని రోజులు శంకర్ ఏం తీశాడబ్బా అని అందరూ అనుకుంటూ ఉన్నప్పటికీ కూడా…

ట్రైలర్ రిలీజ్ తర్వాత ఓవరాల్ క్వాలిటీ అండ్ గ్రాండియర్ ఎక్స్ లెంట్ గా ఉండటంతో పాటు మాస్ ఎలిమెంట్స్ సినిమాలో భారీగా ఉన్నాయని కన్ఫాం అవ్వడంతో ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా టాక్ పాజిటివ్ గా వస్తే కలెక్షన్స్ జాతర ఖాయం అని పించేలా ఉంది ఇప్పుడు బజ్…

ఇక బిజినెస్ పరంగా కూడా దుమ్ము లేపుతూ దూసుకు పోతున్న ఈ సినిమా ఒక్కో ఏరియా ఫైనల్ బిజినెస్ లెక్కలు బయటికి వస్తూ ఉండగా రాయలసీమ ఏరియాకి గాను బిజినెస్ ఇప్పుడు ఫైనల్ అయ్యింది. ఇక్కడ సినిమా కి ఓవరాల్ గా ఫైనల్ బిజినెస్…

23 కోట్ల రేంజ్ లో సొంతం అయ్యింది…..రామ్ చరణ్ సోలో హీరోగా ఆర్ ఆర్ ఆర్ కన్నా ముందు చేసిన వినయ విదేయ రామ ఇక్కడ 14 కోట్ల బిజినెస్ ను అందుకోగా ఎన్టీఆర్ తో కలిసి చేసిన ఆర్ ఆర్ ఆర్ మూవీ 37 కోట్ల బిజినెస్ ను చేసింది…

ఆర్ ఆర్ ఆర్ తర్వాత చిరు తో కలిసి చేసిన ఆచార్య సినిమా రాయలసీమ ఏరియాలో 18.50 కోట్ల రేంజ్ లో బిజినెస్ ను సొంతం చేసుకున్నాయి…ఓవరాల్ గా సోలో హీరోగా రామ్ చరణ్ కెరీర్ లోనే ఆల్ టైం హైయెస్ట్ బిజినెస్ ను రాయలసీమ లో సొంతం చేసుకున్న గేమ్ చేంజర్ మీద…

ఇక్కడ మంచి బజ్ ఉన్న నేపధ్యంలో పోటిలో ఇతర సినిమాలు ఉన్నప్పటికీ కూడా టాక్ ఏమాత్రం బాగున్నా కూడా ఓపెనింగ్స్ అలాగే సంక్రాంతి పండగ అడ్వాంటేజ్ లతో కచ్చితంగా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసే అవకాశం ఎంతైనా ఉంటుంది. మరి సినిమా ఎంతవరకు అంచనాలను అందుకుంటుందో చూడాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here