బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సంక్రాంతికి ఆడియన్స్ ముందుకు మంచి అంచనాల నడుమ రామ్ చరణ్(Ram Charan) నటించిన గేమ్ చేంజర్(Game Changer) మూవీ బాలకృష్ణ(Balakrishna) నటిస్తున్న డాకు మహారాజ్(Daaku Maharaaj Movie) సినిమాలు మేజర్ గా పోటి పడబోతూ ఉండగా వెంకటేష్(Venkatesh) నటించిన సంక్రాంతికివస్తున్నాం(Sankranthiki Vasthunam Movie)..
కూడా ఉన్నప్పటికీ మేజర్ పోటి మాత్రం గేమ్ చేంజర్ మరియు డాకు మహారాజ్ ల మధ్య ఉండబోతూ ఉండగా ఈ రెండు సినిమాలకు భారీగా బిజినెస్ తో పాటు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోల కోసం ట్రై చేస్తూ ఉండగా తెలంగాణా లో మాత్రం పుష్ప2(Pushpa 2 Movie)…
రిలీజ్ టైంలో జరిగిన తప్పుల అక్కడ బెనిఫిట్ షోలు ఉండొచ్చా లేదా అన్నది ఇంకా కన్ఫాం అవ్వలేదు కానీ ఆంధ్రలో మాత్రం భారీ ఎత్తున ఈ సినిమాలకు స్పెషల్ షోలు పడబోతున్నాయి ఇప్పుడు…కాగా రామ్ చరణ్ గేమ్ చేంజర్ మూవీ కి జనవరి 10 అర్ధరాత్రి 1 గంట నుండే…
బెనిఫిట్ షోలు పడబోతూ ఉండగా డాకు మహారాజ్ కి జనవరి 12 ఉదయం 4 గంటల నుండి బెనిఫిట్ షోలు పడబోతున్నట్లు సమాచారం. ఇక బెనిఫిట్ షోలకు మరీ పుష్ప2 రేంజ్ లో రేట్స్ పెట్టి ఇబ్బందులు పడకుండా మొత్తం మీద రీజనబుల్ రేట్స్ ను పెట్టబోతున్నారు…
గేమ్ చేంజర్ మూవీ కి ఓవరాల్ గా 600 వరకు టికెట్ రేటు ఉండబోతుందని సమాచారం…ఇక డాకు మహారాజ్ సినిమా కి 500 వరకు బెనిఫిట్ షో రేటు ఉండబోతుందని అంటున్నారు… ఓవరాల్ గా రెండు సినిమాలకు రీజనబుల్ బెనిఫిట్ షోల రేటు ఉండబోతూ ఉండగా…
టాక్ బాగుంటే కచ్చితంగా రెండు సినిమాలు వేటి రేంజ్ లో అవి మంచి జోరుని చూపించే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు…మొత్తం మీద ఈ సంక్రాంతికి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి.