Home న్యూస్ గేమ్ చేంజర్-ధోప్ సాంగ్ రివ్యూ….రామ్ చరణ్ డాన్స్ కుమ్మేశాడుగా!!

గేమ్ చేంజర్-ధోప్ సాంగ్ రివ్యూ….రామ్ చరణ్ డాన్స్ కుమ్మేశాడుగా!!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర సంక్రాంతికి భారీ లెవల్ లో రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా మంచి అంచనాల నడుమ రిలీజ్ కానుండగా….రీసెంట్ గా సినిమా అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని జరుపుకున్న…

ఇండియన్ మూవీగా సంచలనం సృష్టించగా ఇక సినిమా నుండి కొత్త సాంగ్ ను రిలీజ్ చేశారు..ధోప్ సాంగ్ అంటూ లిరికల్ తో రూపొందిన ఈ సాంగ్ మీద తమన్ అండ్ గేమ్ చేంజర్ టీం భారీ హైప్ ను పెంచారు. ఇక ఈ హైప్ ని నిజం చేయడానికి సినిమా సాంగ్…

రీసెంట్ గా రిలీజ్ అవ్వగా సాంగ్ ఆ హైప్ ను పూర్తిగా అందుకుందా లేదా అంటే మొత్తం మీద వినడానికి మాత్రం యావరేజ్ సాంగ్ లానే అనిపించగా విజువల్స్ పరంగా కానీ అదే టైంలో రామ్ చరణ్ గ్రేస్ తో చేసిన ఎక్స్ లెంట్ స్టెప్స్ కానీ చాలా బాగా ఆకట్టుకోవడంతో…

వినడానికి సాంగ్ ఎలా ఉన్నా కూడా చూడటానికి మాత్రం విజువల్ పరంగా చాలా బాగా ఆకట్టుకుంది సాంగ్…తమన్ మరీ హైప్ ఇచ్చిన రేంజ్ లో సాంగ్ బీట్ ఏమి ఇంప్రెస్ చేయలేక పోయింది కానీ విజువల్స్ అండ్ గ్రాండియర్ తో సాంగ్ బాగా ఆకట్టుకుంది…

సినిమా నుండి వచ్చిన ఇతర సాంగ్స్ తో పోల్చితే ఈ సాంగ్ వినడానికి యావరేజ్ గా ఉన్నప్పటికీ విజువల్స్ పరంగా రామ్ చరణ్ స్టెప్స్ పరంగా ఫుల్ మార్కులు పడతాయి కానీ సాంగ్ కూడా వినడానికి అదే రేంజ్ లో ఆకట్టుకుని ఉంటే ఫుల్ మార్కులు పడేవి అని చెప్పాలి. 

మొత్తం మీద సాంగ్ లో రామ్ చరణ్ వేసిన స్టెప్స్ తో సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోయాయి అని చెప్పాలి. విజువల్ గ్రాండియర్ పరంగా కూడా ఇదే రేంజ్ లో మెప్పిస్తే థియేటర్స్ లో ఆడియన్స్ బాగా ఎంజాయ్ చేసే అవకాశం ఎంతైనా ఉంది…ఇక 24 గంటల్లో సాంగ్ ఎలాంటి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి ఇక…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here