Home న్యూస్ గేమ్ చేంజర్ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే…కాచుకోండి ఇక!

గేమ్ చేంజర్ ట్రైలర్ బ్రేక్ చేయాల్సిన రికార్డులు ఇవే…కాచుకోండి ఇక!

0

టాలీవుడ్ లో సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ రిలీజ్ కి సిద్ధం అవుతున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) శంకర్(Shankar) ల క్రేజీ కాంబోలో రూపొందిన సెన్సేషనల్ మూవీ గేమ్ చేంజర్(Game Changer) సినిమా తెలుగుతో పాటు ఇతర భాషల్లో భారీ లెవల్ లో రిలీజ్ కాబోతూ ఉండగా….

సినిమా అఫీషియల్ ట్రైలర్ ను ఇప్పుడు రిలీజ్ కి సిద్ధం చేస్తూ ఉండగా ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ అందరూ కూడా సినిమా ట్రైలర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు…సినిమా మీద ప్రస్తుతానికి బజ్ కొంచం తక్కువగా ఉండగా ట్రైలర్ రిలీజ్ తర్వాత బజ్ పెరిగే అవకాశం ఎంతైనా ఉంది…

ఇక ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత బ్రేక్ చేయాల్సిన మేజర్ రికార్డులు కూడా కొన్ని ఉన్నాయి ఇప్పుడు…టాలీవుడ్ లో మేజర్ గా ఏ పెద్ద సినిమా రిలీజ్ అయినా కూడా ట్రైలర్ ల పరంగా ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ను ముఖ్యంగా చూస్తూ ఉంటారు…

ఫాస్టెస్ట్ 1 లక్ష లైక్స్ ని సలార్ ట్రైలర్ 3 నిమిషాల టైంకే సొంతం చేసుకుంది. ఇక రెండో ప్లేస్ లో భీమ్లా నాయక్ ట్రైలర్ 4 నిమిషాల టైంకి సొంతం చేసుకుంది. ఇక 24 గంటల్లో ఓవరాల్ గా హైయెస్ట్ వ్యూస్ పరంగా పుష్ప2 ట్రైలర్ 44.67 మిలియన్ వ్యూస్ మార్క్ ని అందుకుని టాప్ లో ఉండగా…

రెండో ప్లేస్ లో గుంటూరు కారం ట్రైలర్ 37.68 మిలియన్ వ్యూస్ తో టాప్ 2 లో నిలిచింది. ఇక లైక్స్ పరంగా 24 గంటల్లో టాప్ రికార్డ్ హోల్డర్స్ గా ఆర్ ఆర్ ఆర్ ట్రైలర్ 1.24 మిలియన్ లైక్స్ తో దుమ్ము లేపుతూ దూసుకు పోతూ ఉండగా రెండో ప్లేస్ లో..

1.238 మిలియన్ లైక్స్ మార్క్ ని అందుకుని కుమ్మేసింది…గేమ్ చెంజర్ ట్రైలర్ మేజర్ గా బ్రేక్ చేయాల్సిన రికార్దులు ఇవి…సినిమా మీద ఉన్న బజ్ ఓ రేంజ్ లో పెరగాలి అంటే ఈ రికార్డులను సినిమా ట్రైలర్ బ్రేక్ చేస్తే మరింత రీచ్ ను సొంతం చేసుకుని బాక్స్ ఆఫీస్ దగ్గర మరింత జోరు ని చూపించే అవకాశం ఎంతైనా ఉంటుంది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here