Home న్యూస్ గీత గోవిందం@180…మామూలు భీభత్సం కాదిది!

గీత గోవిందం@180…మామూలు భీభత్సం కాదిది!

0

విజయ్ దేవరకొండ రష్మిక జంటగా పరుశురాం డైరెక్షన్ లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ గీత గోవిందం…రిలీజ్ కి ముందు నుండి సూపర్ పాజిటివ్ బజ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా 15 న అత్యంత భారీ ఎత్తున రిలీజ్ కి సిద్ధం అవుతుంది.

సినిమాను ఓవర్సీస్ లో అయితే మీడియం రేంజ్ హీరోలలోనే బిగ్గెస్ట్ రిలీజ్ ని సొంతం చేసుకోబోతుంది అని చెప్పొచ్చు. ఏకంగా 175 నుండి 185 లోకేషన్స్ లో గీత గోవిందం సినిమా రిలీజ్ కాబోతుంది. ఇది నిజంగానే బిగ్గెస్ట్ రిలీజ్ అని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

ఓవర్సీస్ లో సినిమా బిజినెస్ 2.7 కోట్లకు జరగడంతో సినిమా అక్కడ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మినిమమ్ 0.8 మిలియన్ మార్క్ ని అందుకోవాల్సి ఉంటుంది. ప్రీమియర్ షోలకి అక్కడ వన్ ప్లస్ వన్ టికెట్ ఆఫర్స్ ఉండటంతో ప్రీమియర్స్ తోనే భారీ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడం ఖాయమని అంటున్నారు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here