Home న్యూస్ గీత గోవిందం డే 2 కలెక్షన్స్…మళ్ళీ ఊచకోతే

గీత గోవిందం డే 2 కలెక్షన్స్…మళ్ళీ ఊచకోతే

0

తమిళనాడుతో చేసిన ఊచకోతతో మొదటి రోజు టోటల్ గా 9.8 కోట్ల వరల్డ్ వైడ్ షేర్ ని అందుకున్న విజయ్ దేవరకొండ గీత గోవిందం సినిమా ఇప్పుడు రెండో రోజు కూడా సాలిడ్ కలెక్షన్స్ తో దుమ్ము లేపుతుంది. రెండు తెలుగు రాష్ట్రాలలో ఆల్ మోస్ట్ 50% ఆక్యుపెన్సీతో రన్ అవుతుంది.

దాంతో రెండో రోజు కూడా సినిమా సాలిడ్ కలెక్షన్స్ ని దక్కించుకోవడం ఖాయంగా కనిపిస్తుండగా ఈవినింగ్ షోలకి కూడా గ్రోత్ స్టడీగా ఉండటంతో రెండోరోజు లెక్క సూపర్ సాలిడ్ గా ఉండే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు భావిస్తున్నారు.

మొత్తం మీద డే చివర్లో వచ్చిన అప్ డేట్స్ ప్రకారం సినిమా రెండో రోజు కూడా టోటల్ వరల్డ్ వైడ్ గా 4.2 నుండి 4.5 కోట్ల రేంజ్ లో షేర్ ని అందుకునే ఛాన్స్ ఉందని చెబుతున్నారు. ఇది నిజంగానే భీభత్సం అని చెప్పొచ్చు. అన్నీ అనుకున్నట్లు జరిగితే 3 రోజుల్లో సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here