విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డితో విపరీతమైన క్రేజ్ వచ్చింది….ఆ క్రేజ్ లో భాగంగానే భారీ ఆఫర్స్ కూడా ఒకటి తర్వాత ఒకటి వచ్చాయి. అలా వచ్చిన మూవీస్ లో ముందుగా ఇప్పుడు గీత గోవిందం తో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాడు విజయ్ దేవరకొండ.
బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా అద్బుతమైన పాజిటివ్ బజ్ నడుమ రిలీజ్ కానుండగా సినిమా పై అంచనాలు కూడా భారీ గా ఉన్నాయి. కాగా రెండు తెలుగు రాష్ట్రాలలో ఈ సినిమాను ఓ రేంజ్ లో రిలీజ్ చేయబోతున్నట్లు సమాచారం. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో వస్తుండటం కూడా సినిమాకి కలిసి వచ్చింది.
నైజాం లో ఏకంగా 250 కి పైగా థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ఆంధ్రా మరియు సీడెడ్ లలో కలిపి మరో 500 వరకు థియేటర్స్ లో రిలీజ్ కానుంది. అంటే రెండు రాష్ట్రాలలోనే ఏకంగా 750 థియేటర్స్ అంటే సినిమా ఓపెనింగ్స్ పరంగా కుమ్మేయడం ఖాయమని చెప్పొచ్చు.