Home Uncategorized 180 కోట్ల సినిమా…ఇలా ఎవ్వరూ పట్టించుకోరేంటి!

180 కోట్ల సినిమా…ఇలా ఎవ్వరూ పట్టించుకోరేంటి!

4730
0

భారీ బడ్జెట్ సినిమాల విషయం లో అప్పుడప్పుడు బడ్జెట్ కంట్రోల్ తప్పి అనుకున్న దానికన్నా కూడా ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది, చాలా సార్లు ఇలా జరగుతూ రాగా ఎలాగైనా ఆ ప్రాజెక్ట్ ను కంప్లీట్ చేయాలనీ చూస్తారు కానీ మధ్యలో అయితే ఆ సినిమాను వదిలేయరు…ఎందుకంటే అప్పటికే కోట్లకి కోట్లు ఆ సినిమా పై పెట్టారు కాబట్టి. కానీ రీసెంట్ గా ఒక సినిమా విషయం లో మాత్రం ఇది జరగలేదు…

 ఆ సినిమానే ఇండియా లో టాప్ డైరెక్టర్స్ లో ఒకరైన శంకర్ డైరెక్షన్ లో కమల్ హాసన్ హీరోగా రూపొందుతున్న ఇండియన్ 2 సినిమా. ఈ సినిమా ఎప్పటి నుండో షూటింగ్ జరుపుకుంటూ ఉండగా ఆల్ మోస్ట్ నిర్మాతలు ఇప్పటి వరకు 180 కోట్ల బడ్జెట్ ను సినిమా కోసం పెట్టారు.

కానీ అప్పట్లో సినిమా షూటింగ్ లో భాగంగా ఒక ఇంసిడెంట్ జరగడం కొందరు చనిపోవడం తో అప్పటి నుండి సినిమా షూటింగ్ ఆగిపోగా, శంకర్ ఇప్పుడు ఈ సినిమాను పక్కకు పెట్టి కొత్త సినిమాలను కమిట్ అవ్వడం మొదలు పెట్టగా కమల్ హాసన్ కూడా ఈ సినిమా ను పక్కకు పెట్టి..

లొకేషన్ కనగారాజ్ డైరెక్షన్ లో విక్రం మూవీ ని మొదలు పెట్టాడు, ఇక ఈ సినిమా కోసం ఏకంగా 180 కోట్లు పెట్టిన లైకా వాళ్ళు కోర్టుని ఆశ్రయించి శంకర్ ఈ సినిమాను పూర్తీ చేసి తీరాల్సిందే అంటూ కేసు వేసినా కోర్టు శంకర్ కి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. దాంతో ఈ ఇయర్ ఎండ్ టైం లో ఈ సినిమా షూటింగ్ చేస్తానని శంకర్ చెబుతున్నా అది కూడా కష్టమే అంటున్నారు.

ఎందుకంటే ఆన్ లొకేషన్ లో జరిగిన ఇంసిడెంట్ లో చనిపోయిన వాళ్ళ విషయం లో కమల్ హాసన్ కి నిర్మాతలకు గొడవ జరగడం తో కమల్ హాసన్ అప్పటి నుండి సినిమాను పట్టించుకోవడం లేదట, శంకర్ కూడా ఆ విషయంలోనే సీరియస్ అయ్యారని తెలుస్తుంది. దాంతో అప్పటి నుండి జరిగిన గొడవల వలన ఇద్దరూ సినిమాను పక్కకు పెట్టేశారు అంటున్నారు. మరి ఈ వ్యవహారం ఎప్పుడు సద్దుమనుగుతుందో తెలియదు కానీ అంత డబ్బు పెట్టిన నిర్మాతలకు మాత్రం గట్టి ఎదురుదెబ్బే తగిలింది అని చెప్పాలి.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here