Home న్యూస్ గుంజన్ సక్సేనా రివ్యూ….సినిమా బాగుంది కానీ!!!

గుంజన్ సక్సేనా రివ్యూ….సినిమా బాగుంది కానీ!!!

0

ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అయిన మొట్ట మొదటి మహిళా ఆఫీసర్ అయిన గుంజన్ సక్సేనా జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన సినిమా గుంజన్ సక్సేనా, జాన్వి కపూర్ మెయిన్ లీడ్ చేసిన ఈ సినిమాను కరణ్ జోహార్ నిర్మించ గా సినిమాను నెట్ ఫ్లిక్స్ లో రీసెంట్ గా డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ చేశారు. సినిమా ఎలా ఉంది, అంచలను అందుకుందా లేదా అన్న విశేషాలను తెలుసుకుందాం పదండీ..

కథ విషయానికి వస్తే చిన్నప్పటి నుండి పైలట్ అవ్వాలని కోరుకునే గుంజన్ సక్సేనా, డిప్లొమా పూర్తి చేసిన తర్వాత పైలట్ కోర్స్ లో జాయిన్ అవ్వాలి అనుకుంటే ఫీజు 10 లక్షలు అని తెలిసి వెనక్కి తగ్గిన టైం లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అమ్మాయిలను కూడా చేర్చుకుంటున్నాం అని ప్రకటించడంతో…

ఎయిర్ ఫోర్స్ లో జాయిన్ అవ్వడానికి ట్రైల్స్ మొదలు పెట్టగా అన్ని పరీక్షల్లో పాస్ అయినప్పటికీ మెడికల్ టెస్ట్ లో ఫెయిల్ అవుతుంది, తర్వాత తండ్రి అనూప్ సక్సేనా ప్రోత్సాహంతో ఎలా పైలట్ అయింది అక్కడ తనకి ఎలాంటి అనుభవాలు ఎదురు అయ్యాయి, పోరాటాల్లో తన ప్రతిభ ఎలా చూపింది లాంటివి సినిమా చూసి తెలుసుకోవాల్సిందే.

సినిమా కథ పాయింట్ అందరికీ చాలా ఇన్స్పిరేషనల్ గా ఉంటుంది, ముఖ్యంగా అమ్మాయిలకు… కానీ ఇది బయోపిక్ అవ్వడం తో గుంజన్ సక్సేనా లైఫ్ స్టొరీ మొత్తం గుడ్ అండ్ బ్యాడ్ క్లుప్తంగా చూపెడతారు అనుకుంటే మెయిన్ ఇంపార్టెన్స్ ఉన్న ఘట్టాలను మాత్రమే ఎంచుకుని సినిమా గా తీశారు.

అలా కాకుండా తన గురించి యుద్దాల్లో తన పనితీరు గురించి మరింత విశదీకరించి ఉంటె మరింత బాగుండేది అనిపించింది, పెర్ఫార్మెన్స్ పరంగా మిగిలిన నటీనటులు అందరూ ముఖ్యంగా తండ్రి రోల్ చేసిన పంకజ్ త్రిపాఠి ఇతరులు అద్బుత నటనతో మెయిన్ లీడ్ రోల్ చేసిన జాన్వి కపూర్ ని అవుట్ షైన్ చేశారు.

ఎందుకనో జాన్వి కపూర్ ఈ రోల్ కి అస్సలు సెట్ కాలేదు అనిపిస్తుంది, తన లుక్స్ సినిమా మొత్తం ఒకేలా ఉండగా ఎక్స్ ప్రెషన్స్ ఏమాత్రం పలికించలేకపోయింది. ముఖ్యంగా సెకెండ్ ఆఫ్ లో తన పాత్రకు ఉన్న వెయిట్ ని తను మోయలేక పోయింది. ఇంత మంచి స్ఫూర్తిని నింపే సినిమాలో మెయిన్ రోల్ చేసిన…

హీరోయిన్ మైనస్ అవ్వడం ఇదే తొలిసారి కావచ్చు, తను కాకుండా వేరే ఎవరైనా మంచి నటిని పెట్టి ఉంటె మరింత బాగుండేది, కెరీర్ మొదట్లోనే ఇలాంటి రోల్ ని ఎంచుకోవడం గొప్పే అయినా ఆ రోల్ కి తగ్గ న్యాయం అయితే జాన్వి కపూర్ చేయలేక పోయింది.

సంగీతం పెద్దగా ఇంప్రెస్ చేయక పోయినా బ్యాగ్రౌండ్ స్కోర్ బాగుంది, స్క్రీన్ ప్లే బాగానే ఉంది, తక్కువ నిడివి ఉండటం తో చక చకా సినిమా గడిచిపోతుంది, డైలాగ్స్ చాలా బాగా రాసుకున్నారు, సినిమాటోగ్రఫీ క్లైమాక్స్ వార్ సీన్ లో చాలా బాగా చిత్రీకరించారు. ఇక డైరెక్షన్ విషయానికి వస్తే..

మంచి కథకి తగ్గ నటీనటులను ఎంచుకోవడం అవసరం, తొలి సినిమా అవ్వడం కరణ్ జోహార్ తనకి నచ్చిన వాళ్ళని తీసుకోవడం తో డైరెక్టర్ ఏమి చేయలేక పోయాడేమో అనిపిస్తుంది, మెయిన్ లీడ్ విషయం లో బెటర్ ఆప్షన్ కి వెళ్లి, అలాగే గుంజన్ సక్సేనా గారి గురించి మరింత బాగా వివరించి ఉంటె ఇంకాస్త బాగుండేది సినిమా.

ఓవరాల్ గా డిఫెరెంట్ మూవీస్ ని బయోపిక్స్ ని ఇష్టపడే వారికి సినిమా బాగా నచ్చుతుంది, రొటీన్ మూవీస్ చూసే వారికి యావరేజ్ టు ఎబో యావరేజ్ రేంజ్ లో అనిపిస్తుంది, ఓవరాల్ గా ఈజీగా ఒకసారి చూసే విధంగా సినిమా ఉంటుంది, సినిమాకి మా ఫైనల్ రేటింగ్ 2.75 స్టార్స్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here