బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఇయర్ సంక్రాంతికి భారీ అంచనాల నడుమ ఆడియన్స్ ముందుకు వచ్చిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) త్రివిక్రమ్ ల కాంబోలో ఆడియన్స్ ముందుకు వచ్చిన గుంటూరు కారం(Guntur Kaaram Movie) హైప్ కి తగ్గ టాక్ ను సొంతం చేసుకునే విషయంలో విఫలం అవ్వగా…
పోటిలో ఉన్న హనుమాన్(HanuMan Movie) మాస్ రాంపెజ్ వలన పరుగును త్వరగానే కంప్లీట్ చేసుకున్న గుంటూరు కారం సినిమా…టోటల్ రన్ లో 184 కోట్ల రేంజ్ లో గ్రాస్ ను అందుకుని పరుగును ముగించి తర్వాత డిజిటల్ లో రిలీజ్ అయ్యి అక్కడ మాత్రం సూపర్ సాలిడ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంది.
నెట్ ఫ్లిక్స్ లో వన్ ఆఫ్ ది హైయెస్ట్ వ్యూస్ తో రచ్చ చేయగా మరో పక్క బాక్స్ ఆఫీస్ దగ్గర ఒక థియేటర్ లో సినిమా లాంగ్ రన్ ను సొంతం చేసుకుని రీసెంట్ గా 175 రోజులను కంప్లీట్ చేసుకోగా ఇప్పుడు ఏకంగా 200 రోజులను డైలీ 4 షోలతో కంప్లీట్ చేసుకుని మాస్ ఊచకోత కోసింది…
ఆంధ్రప్రదేశ్ లో సినిమా చిలకలూరిపేట-వెంకటేశ్వర థియేటర్ లో రీసెంట్ గా 200 వ రోజును కంప్లీట్ చేసుకుంది…అది కూడా రోజుకి 4 షోలతో కంప్లీట్ చేసుకుంది సినిమా…టాలీవుడ్ లో ఒకప్పటిలా 175-200 డేస్ ఆడే సినిమాలు పూర్తిగా తగ్గిపోగా రీసెంట్ గా ఒకటి 2 థియేటర్స్ లో ఇలా…
ఒకటి రెండు సినిమాలు ఇన్నేసి రోజులు ఆడుతూ ఉండటం విశేషం. ఇక మహేష్ బాబు గుంటూరు కారం తర్వాత తన తర్వాత సినిమా ఇండియన్ నంబర్ 1 డైరెక్టర్ ఎస్ ఎస్ రాజమౌళి(SS Rajamouli) డైరెక్షన్ లో చేయబోతూ ఉండగా ఆ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో ఏ లెవల్ లో రచ్చ చేస్తాడో చూడాలి.