Home న్యూస్ హనుమాన్ హిందీ కలెక్షన్స్…ఒక్క అడుగు దూరంలో మ్యాజికల్ నంబర్!

హనుమాన్ హిందీ కలెక్షన్స్…ఒక్క అడుగు దూరంలో మ్యాజికల్ నంబర్!

0

బాక్స్ ఆఫీస్ దగ్గర తెలుగు రాష్ట్రాల్లో ఎక్స్ లెంట్ కలెక్షన్స్ తో లాంగ్ రన్ ని ఎంజాయ్ చేసిన మమ్మోత్ బ్లాక్ బస్టర్ హనుమాన్(HanuMan Movie) ఓవర్సీస్ లో కూడా రికార్డ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా సినిమా హిందీలో కూడా ఓవరాల్ గా సాలిడ్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుంటూ పరుగును కొనసాగించగా…

కొత్త సినిమాలు రిలీజ్ అయినా కూడా సినిమా ఉన్న లిమిటెడ్ థియేటర్స్ లోనే అక్కడ మంచి కలెక్షన్స్ ని సొంతం చేసుకోగా నాలుగో వీకెండ్ కంప్లీట్ అయ్యే టైంకి సాధించిన కలెక్షన్స్ తో ఇప్పుడు ఆల్ మోస్ట్ 49 కోట్లకు పైగా నెట్ కలెక్షన్స్ మార్క్ ని సొంతం చేసుకోగా ఒక్క  అడుగు దూరంలో సినిమా ఇప్పుడు…

మ్యాజికల్ 50 కోట్ల నెట్ కలెక్షన్స్ మార్క్ ని అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి. సినిమా మొత్తం మీద హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియా లో ఇప్పటి వరకు సాధించిన కలెక్షన్స్ తో 24.65 కోట్ల రేంజ్ లో షేర్ మార్క్ ని అందుకుని భారీ లాభాలతో దుమ్ము దుమారం లేపే విజయాన్ని సొంతం చేసుకుంది.

HanuMan Movie 24 Days Total WW Collections!

ఓవరాల్ గా సినిమా హిందీ అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో వాల్యూ బిజినెస్ రేంజ్ 3.5 కోట్ల రేంజ్ దాకా ఉండగా సినిమా అక్కడ నుండే ఆల్ మోస్ట్ 21 కోట్లకు పైగా లాభాలను సొంతం చేసుకుంది. హిందీలో కొన్ని సినిమాలు చూపించిన రేంజ్ రాంపెజ్ ను చూపెట్టి ఉంటే 100 కోట్లు అందుకునేది కానీ పెద్దగా స్టార్ కాస్ట్ తెలియని ఈ సినిమా…

లాంగ్ రన్ లో 50 కోట్ల రేంజ్ లో నెట్ కలెక్షన్స్ ని అందుకోవడం కూడా విశేషం అనే చెప్పాలి. ఇక జై హనుమాన్ మూవీ తో హిందీలో కూడా వచ్చే ఏడాది సాలిడ్ రికార్డులను అందుకునే అవకాశం ఎంతైనా ఉందని చెప్పాలి ఇప్పుడు.

HanuMan Movie 23 Days Total WW Collections!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here